1. ఆ నాలుగు రాష్ట్రాలే కీలకం!
అగ్రరాజ్యంలో ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ఇంకా జరుగుతున్న వేళ.. అధ్యక్ష అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఎలక్టోరల్ ఓట్లలో బైడెన్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌నకు పట్టు ఉండటం వల్ల పరిస్థితులు ఏ క్షణంలోనైనా మారిపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఎందుకీ వివక్ష
ఇంటింటికీ తాగునీరు ఇచ్చే విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ప్రశంసిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. నిధుల విషయంలో మాత్రం రాష్ట్రంపై వివక్ష చూపుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. పదేళ్ల క్రితం పూర్తి చేసిన గుజరాత్‌కు, కొద్దిపాటి పనులు కూడా పూర్తి కాని ఉత్తరప్రదేశ్‌కు నిధులు ఇచ్చిన కేంద్ర.. తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. తెరాస కార్యాలయానికి భూమి
దిల్లీలో తెరాస పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన భూమిని ఆ పార్టీకి కేంద్రం అప్పగించింది. తెరాస తరఫున మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి అధికారులు భూమిని అప్పగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఉత్తమ్ పరామర్శ
చౌటుప్పల్ వద్ద జరిగిన ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కుమారుడు షేక్ షారుఖ్ మరణించాడు. వారి కుటుంబానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. నేను భయపడను
లాక్‌డౌన్‌తో తీవ్రంగా ప్రభావితమైన పేదలకు ఎలాంటి సాయం చేయని వారు.. ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీ ఓటింగ్ మిషన్ లేదా మోదీ మీడియకు తాను భయపడనని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.