1. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో విచారణ
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు విచారణ చేసింది. పూర్తి నివేదిక ఇవ్వడానికి మరింత సమయం కావాలని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ వేసిన అప్లికేషన్‌పై చర్చించింది. కరోనా నేపథ్యంలో విచారణ ఆలస్యమవుతోందని... ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గడువు కావాలని కమిషన్ కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ
పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు ప్రజాప్రతినిధులు, సీని ప్రముఖులు, తెరాస శ్రేణులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హ్యాపీ బర్త్‌డే కేటీఆర్ హ్యాస్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంది. గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో ఓ చిరునవ్వును... ఆయన పేరున కానుకగా ఇచ్చే కార్యక్రమంతో అభిమానులు ముందుకెళ్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.'కేటీఆర్ తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు'
కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రక్తదానం చేయడం చాలా అభినందనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. గహ్లోత్ సర్కార్‌కు షాక్- పైలట్ వర్గానికి ఊరట
రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. హైకోర్టులో గహ్లోత్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. శాసనసభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది కోర్టు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. బాబ్రీ మసీదు కేసులో అడ్వాణీ వాంగ్మూలం నమోదు
బాబ్రీ మసీదు కేసులో లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ వాంగ్మూలం ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం ఇచ్చారు అడ్వాణీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.