తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @9AM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 9AM NEWS
టాప్​ టెన్​ న్యూస్​ @9AM

By

Published : Mar 25, 2021, 8:57 AM IST

1. నలుగురు ఆత్మహత్య

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాసిపేట మండలం మల్కపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు, కుమార్తెతో పాటు దంపతులు ఉరేసుకుని బలవన్మరణం చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. అభ్యర్థుల్లో అయోమయం

నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నెల 23 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ ఇందులో 27, 28, 29 తేదీలను సెలవులుగా నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. పద్దులపై ముగియనున్న చర్చ

శాసనసభలో పద్దులపై చర్చ నేటితో ముగియనుంది. రెండు రోజులుగా 26 పద్దులపై అసెంబ్లీ చర్చ జరిపి ఆమోదించగా... ఇవాళ మరో 12 శాఖలపై చర్చించనుంది. రేపటితో శాసన సభ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'సద్వినియోగం కావాలి'

రాష్ట్రంలో సాగునీరు పుష్కలంగా లభిస్తున్నందున నీటిపారుదల వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని... కాల్వలు, పంపులు, బ్యారేజీల గేట్లు, రిజర్వాయర్లను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఏడు బస్సులు దగ్ధం

మధ్యప్రదేశ్​ దామొహ్​ బస్టాండ్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడు బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. వాడీవే'ఢీ'!

ఇద్దరు రాజకీయ దిగ్గజాలు జయలలిత, కరునానిధి లేకపోయినా తమిళనాట ఎన్నికల వేడి ఏమాత్రం తగ్గట్లేదు. ప్రధాన పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకే ఢీ అంటే ఢీ అంటున్నాయి. అధికారమే లక్ష్యంగా ఇరు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'ఒప్పందానికి అనుగుణంగానే..'

సింధు నదీ జలాల ఒప్పందంపై భారత్​-పాకిస్థాన్​ మధ్య జరిగిన సమావేశంలో.. దాయాది అభ్యంతరాలను భారత్​ తిరస్కరించింది. ప్రాజెక్టుల నిర్వహణపై స్పష్టత ఇచ్చింది. ఒప్పందానికి అనుగుణంగానే ప్రాజెక్టు నిర్వహణ జరుగుతుందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. హారిస్​కు 'వలసల' బాధ్యత

వలసల సమస్యలను పరిష్కరించే బాధ్యతను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​కు అప్పగించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. ఆమె అయితేనే ఈ పనిని సమర్థవంతంగా నిర్వహించగలరని బైడెన్​ నమ్ముతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'గొప్ప అవకాశం'

భారత్​లో ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​ కంటే ముందు ఐపీఎల్​లో ఆడటం గొప్ప అవకాశమని ఇంగ్లీష్ క్రికెటర్ బెయిర్​స్టో చెప్పాడు. ప్రస్తుతం ఇతడు భారత్​తో వన్డే సిరీస్ ఆడుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఊపిరి నుంచే మాట!

ఇన్నాళ్లు గేయరచయితగా తెలుగు ప్రేక్షకులను అలరించిన వనమాలి.. 'అరణ్య' చిత్రంతో తొలిసారి మాటల రచయితగా మారారు. ఈ కొత్త బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత పాటల కంటే మాటలు రాయడమే కష్టమని అభిప్రాయపడ్డారు. రానా ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం (మార్చి 26)న ప్రేక్షకుల ముందుకురానుంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details