1. నేటి నుంచి విద్యాసంస్థలు బంద్
పాఠశాలలు ప్రారంభమై 2నెలలైనా గడవకముందే మళ్లీ మూతపడ్డాయి. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి విద్యాలయాలు మూతపడనున్నాయి. కరోనా కల్లోలం కలవరపెడతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. నేడూ కొనసాగనున్న చర్చ
శాసనసభలో నేడు కూడా పద్దులపై చర్చ జరగనుంది. ఇవాళ విద్యాశాఖ, వైద్యారోగ్యం సహా వివిధ శాఖల పద్దులపై చర్చ చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. అభ్యర్థిపై సమాలోచనలు
నాగార్జునసాగర్ ఉపపోరు అభ్యర్థి ఖరారుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. నామినేషన్ల దాఖలుకు మరో వారం గడువే ఉండటంతో అభ్యర్థిని ఒకట్రెండు రోజుల్లో ప్రకటించాలని యోచిస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు తెలిసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. తెలంగాణ 7వ స్థానం
ఎఫ్‌డీఐల ఆకర్షణలో దేశంలో తెలంగాణ 7, 14వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో అత్యధిక మొత్తం ఎఫ్‌డీఐలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, తమిళనాడు, హరియాణాలకు వెళ్లాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'ప్రత్యేక హోదా కుదరదు'
ఏపీ ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఆ స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.