1. నేటి నుంచి ఆర్థిక సాయం
హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదలతో బాధితులుగా మారిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయనుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. నేటి నుంచి వారం రోజుల్లో సాయం అందించాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ముంపులోనే వేలాది కుటుంబాలు
హైదరాబాద్ నగరం నవరసాలతో ఆకర్షిస్తుంది.. ఉపాధి అవకాశాలతో ఊరిస్తుంది. ఆ ఆశతోనే ఎన్నో వేలు, లక్షలమంది ఈ నీడన చేరతారు. అనుకోని ఉపద్రవం.. ప్రకృతి వైపరీత్యం వారి బతుకుల్ని రోడ్డున పడేస్తే కోలుకోవడం.. మళ్లీ తలెత్తుకు నిల్చోవడం ఎంత కష్టం! ఎంత నష్టం!. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'తేరుకోవడం కష్టమే'
భాగ్యనగరంలోని వందలాది ముంపు కాలనీల్లో ఎవరిని కదిపినా ఇదే పరిస్థితి. ‘అంతా వరదలో కొట్టుకుపోయాయి. ఉన్న సామగ్రి కూడా వినియోగానికి పనికిరావు’ అంటూ తల్లడిల్లుతున్న దృశ్యాలే. భారీ వానలతో విధ్వంసానికి గురైన ప్రాంతాల్లో ‘ఈనాడు- ఈటీవీ భారత్’ పర్యటించి వారి కష్టాలను తెలుసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'
అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. చాలా చోట్ల పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయన్న ఆయన... ఆశించిన మేర దిగుబడులు రాకపోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. వెంటిలేటర్ల తయారీలో భారత్ భేష్
మహమ్మారి కరోనా ఊపిరితిత్తులపై ప్రభావం చూపి.. ఊపిరి ఆడకుండా చేస్తోంది. దేశంలో కొవిడ్ కేసులు పెరిగిన క్రమంలో ఊహించని రీతిలో వెంటిలేటర్ల అవసరం ఏర్పడింది. అప్పటికి దేశంలో ఉన్న వెంటిలేటర్ల సంఖ్య అంతంతమాత్రమే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. రూ.754 కోట్ల మోసం
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ ఎమ్మెల్యే వినయ్ శంకర్ తివారీపై కేసు నమోదైంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని కన్సార్షియంల నుంచి అధిక మొత్తంలో రుణాలు తీసుకుని రూ.754కోట్లు మోసం చేశారన్న ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. తైవాన్‌తో సన్నిహిత సంబంధం చారిత్రక అవసరం!
తైవాన్ను తమ భూభాగంలో కలుపుకోవాలని చైనా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండాలని సేనలకు పిలుపునిచ్చిన జిన్‌పింగ్ ఆ దేశ సరిహద్దుల్లో అత్యాధునిక క్షిపణులు మోహరిస్తున్నారు. చైనా దూకుడు పెరుగుతున్న ఈ తరుణంలో- తైవాన్ విషయంలో భారత వైఖరి ఎలా ఉండాలన్న దానిపై చర్చ ఊపందుకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'జియో విప్లవానికి కారణం అదే'
తన తండ్రి ధీరూభాయ్ అంబానీ ఒకానొక సమయంలో అడిగిన ప్రశ్నకు సమాధానమే రిలయన్స్ జియో అని తెలిపారు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఛైర్మన్ ముకేశ్ అంబానీ. ఎన్‌కే సింగ్ రాసిన "పోట్రేయిట్స్ ఆఫ్ పవర్" పుస్తకావిష్కరణలో పాల్గొన్న ముకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఐసీసీ ఛైర్మన్ రేసులో బాక్లీ, ఖవాజా
ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ గ్రెగోర్ బాక్లీ, సింగపూర్‌కు చెందిన ఇమ్రాన్ ఖవాజా నామినేషన్లు దాఖలు చేశారు. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ కొలివ్ గ్రేవ్స్.. ఊహించిన మద్దతు లేని కారణంగా నామినేషన్ వేయలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. డీడీఎల్జే@25: ప్రేమికులంటే గుర్తొచ్చేది!
జనరేషన్లతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న 'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే' సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలపై ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.