1. జీఎస్టీపై.. ఇవాళ నిర్ణయం
జీఎస్టీ పరిహారం చెల్లింపునకు సంబంధించి జీఎస్టీ మండలి రాష్ట్రాల ముందుంచిన రెండు ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఉన్నతస్థాయి సమీక్షలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ప్రభుత్వ ఐసీయూకు తాకిడి
గత నెలరోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల సంఖ్య 21 నుంచి 60 శాతానికి పెరిగింది. ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య దాదాపు 23 శాతానికి పైగా తగ్గింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సందడిగా మారిన ట్యాంక్‌బండ్
గణనాథుల నిమజ్జనాలతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఓటర్ల జాబితా
లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం ఒకే ఓటర్ల జాబితాను ఖరారు చేసే దిశగా భాజపా సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు తాజాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ప్రతి రోజూ పళ్లెంలో
కరోనా కాలంలో శరీరంలో తగినంత రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. శరీరం ఎంత దృఢంగా ఉంటే.. కొవిడ్ లాంటి వ్యాధులను అంత సులువుగా జయించవచ్చు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.