1. రాష్ట్రంలో 20వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య
రాష్ట్రంలో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాల్చింది. శుక్రవారం ఏకంగా 1,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తవాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20 వేలు దాటింది. తాజాగా మరో 8మంది మహమ్మారికి బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కరోనా పరీక్షల ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమానం
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో నిర్వహించిన కరోనా పరీక్షల ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. సదరు ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో 71.7 శాతం మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో ఆ గణాంకాలను పరిగణనలోకి తీసుకోబోమని సర్కారు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. తెలంగాణలో ఆకలి చావుల్లేవు
తెలంగాణలో ఆకలి చావుల్లేవని హైకోర్టు పేర్కొంది. నిర్మాణ కార్మికులు ఆకలి చావుల బారిన పడ్డారన్న వాదనలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. సమరావతి@ ఆ 29 గ్రామాల్లో 'అ' అంటే.. అమరావతే
ఒక రాష్ట్రం-ఒక రాజధాని. కర్షకులే సారథులై, అతివలే అపర దుర్గలై అలుపు సొలుపులేక సాగిపోతున్న ఉద్యమం.. 200 రోజుల మైలురాయి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల స్వరం.. న్యాయం కోసం నిత్యం నినదిస్తూనే ఉంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రైల్వే బోర్డు కీలక నిర్ణయం..
రైల్వే బోర్డు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతకు సంబంధించినవి మినహా కొత్త పోస్టుల మంజూరు, భర్తీ ప్రక్రియను నిలిపివేసింది. కొత్తనోటిఫికేషన్లు చేపట్టవద్దని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'మోదీ వస్తే రామమందిర నిర్మాణం ప్రారంభిస్తాం'
అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి జులై 18న రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు భేటీ కానున్నారు. ఆలయ స్తంభాలకు పునాది రాళ్లు వేసే విషయమై ఇందులో చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. భౌతిక దూరం పాటిస్తూ పార్లమెంట్ సమావేశాలు
కరోనా సంక్షోభం నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎలా నిర్వహించాలన్న దానిపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు... అధికారులతో సమాలోచనలు జరిపారు. భౌతిక దూరం పాటించేలా రాజ్యసభలో సీట్ల ఏర్పాటు విషయమై ఆయన అధికారులతో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. గిలానీ రాజీనామాతో 'వేర్పాటు' రాజకీయాల్లో కుదుపు
హురియత్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవికి సయ్యద్ అలీ షా గిలానీ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఈ పరిణామం జమ్ముకశ్మీర్‌లోని వేర్పాటువాద కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహమే లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. కొత్తరకం కరోనాతో మరింత కంగారు
కొవిడ్‌కు సంబంధించి మరో భయానక విషయాన్ని కనుగొన్నారు పరిశోధకులు. రోజురోజుకీ కరోనా వైరస్ జన్యుక్రమంలో వస్తున్న పరివర్తనంతో మనుషులకు సోకే సామర్థ్యం మరింత మెరుగుపడుతోందని గుర్తించారు పరిశోధకులు. ఇందుకు సంబంధించిన అధ్యయనం 'జర్నల్ సెల్' లో ప్రచురితమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. భారీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన పాయల్!
'భారతీయుడు 2' సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రత్యేక గీతంలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.