1. ఆ తరగతుల విద్యార్థులు ప్రమోట్
రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ రాష్ట్ర ప్రభుత్వం పైతరగతులకు ప్రమోట్ చేసింది. కొవిడ్ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే వారిని పైతరగతులకు ప్రమోట్ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 21 మంది సస్పెండ్
వరంగల్ పుర పాలక ఎన్నికల వేళ పార్టీ నుంచి 21 మందిని తెరాస సస్పెండ్ చేసింది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని 21 మందిని సస్పెండ్ చేసినట్లు తెరాస పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'అక్కడ బెల్టు షాపులపై చర్యలు'
ఎక్సైజ్ అధికారులతో ఎస్ఈసీ పార్థసారథి సమావేశం నిర్వహించారు. మినీ పురపోరు దృష్ట్యా మద్యం దుకాణాల మూసివేతపై నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు తెరవద్దని సూచించారు. ఓట్ల లెక్కింపు రోజు కూడా మద్యం దుకాణాలు తెరవద్దని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'కేసీఆర్ ఖాళీ పోస్టులు నింపు జర'
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వై.ఎస్.షర్మిల సీఎం కేసీఆర్‌ను ట్విట్టర్ వేదికగా కోరారు. కాంట్రాక్టు ఉద్యోగాల పేరిట ఇటీవల 755 ఉద్యోగాలు ప్రకటించిన నేపథ్యంలో షర్మిల స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
5. 'హైకోర్టు చెప్పింది నిజమే!'
దేశంలో వైరస్ వ్యాప్తికి ఎన్నికల సంఘమే కారణమని మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్‌ను కట్టడి చేసేందుకు ఎన్నికల విధుల్లో ఉండి వైరస్ సోకిన కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.