1. అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తినష్టం!
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ప్రైవేటు సోలార్ ప్లాంట్‌లో నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. కోట్లలో ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'ఉద్యోగాల విషయంలో చిత్తశుద్ధి లేదు'
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. భాజపా, తెరాసలు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మేడారంలో గుడి మూసివేత
రేపటి నుంచి 21 రోజుల పాటు మేడారం సమ్మక్క-సారక్క గుడిని మూసివేయనున్నారు. మేడారంలో ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అన్నదానంలో ప్లాస్టిక్ అన్నం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ప్లాస్టిక్ అన్నం కలకలం రేపింది. ఓ అన్నదాన కార్యక్రమంలో వడ్డించిన అన్నం.. ప్లాస్టిక్దని తేలడంతో గ్రామస్థులు విక్రయించిన వ్యాపారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'భాజపాతో మమత పొత్తు'
బంగాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి పావులు కదుపుతోంది. ఈ మేరకు వామపక్షాలు సహా.. ఇతర పార్టీలతో కలసి కోల్కత్తాలో 'పీపుల్స్ బ్రిగేడ్' పేరిట నిర్వహించిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేసి తమ బల ప్రదర్శనకు తెరతీసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.