1. కర్ణాటకలో రెండు వారాలు కర్ఫ్యూ
కర్ణాటకలో 14 రోజులపాటు ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. అత్యవసర సేవలకు ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'రూపాయి ఖర్చు లేకుండా వైద్యం'
పేదలకు రూపాయి ఖర్చులేకుండా వైద్యం అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వెల్లడించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రాబోయే రెండు రోజుల్లో వర్షాలు
రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం
బన్సీలాల్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'వయోజనులందరికీ ఉచితంగా టీకా'
దిల్లీలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. అదే సమయంలో వ్యాక్సిన్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం, తయారీ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.