తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news, today head line news
టాప్​ టెన్​ న్యూస్​@3PM

By

Published : Mar 27, 2021, 2:58 PM IST

1. భాజపాపై ఫిర్యాదు

కోల్​కతాలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు బంగాల్ టీఎంసీ నేతలు. పోలింగ్ బూత్​ ఏజెంట్ల విషయంలో భాజపా నిబంధనలు ఉల్లంఘించిందని ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'బతుకుదెరువు కల్పిస్తాం'

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌ హెచ్ఎండీఏ మైదానంలో సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ, 29 జిల్లాలకు 117 సంచార చేపల విక్రయ వాహనాలు పంపిణీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఫారెస్ట్ సిబ్బంది దాష్టీకం

నాగర్​ కర్నూల్​ జిల్లాలో అమానవీయంగా వ్యవహరించారు అటవిశాఖ సిబ్బంది. గిరిజన మహిళలపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన వారిపై కనికరం లేకుండా.. వృద్ధులను, మహిళలను అసభ్య పదజాలంతో దూషిస్తూ చితక్కొట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'లక్షణాలు లేకున్నాటీకా తప్పనిసరి'

రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభణ మొదలైంది. నిజామాబాద్​ జిల్లా ఇందుకు మినహాయింపేం కాదు. మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్రత ప్రభావం జిల్లాపై అధికంగానే ఉంది. అందుకే ఈ సమయంలో కలెక్టర్​ నారాయణరెడ్డి ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'కేంద్రం విధ్వంస కాండలో కాంగ్రెస్'

కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేరళలో విధ్వంస కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. అభివృద్ధి సంస్థలను నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు. దీనికి విపక్ష యూడీఎఫ్ కూటమి వంత పాడుతోందని విమర్శించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'ప్రపంచ శాంతే మా ఆకాంక్ష'

బంగ్లాదేశ్​ ఓరకండిలోని హరిచంద్​-గురుచంద్​ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనంతరం మతువా వర్గం ప్రజలతో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'సంస్కృతి, సంప్రదాయాన్ని విస్మరిస్తున్నాం'

సమాజ శ్రేయస్సు కోసం నరోత్తమరెడ్డి ఎంతో కృషి చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. బేగంపేటలో నిర్వహించిన శత జయంత్యుత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాన్ని విస్మరిస్తున్నామని... అది మంచిది కాదని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 54 మంది జాలర్లు విడుదల

శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి అరెస్టైన 54మంది భారత జాలర్లను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'అతి జాగ్రత్తే కొంప ముంచింది'

భారత్​తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం వల్లనే టీమ్ఇండియా ఓటమి పాలైందని విమర్శించాడు ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'వేదం' నాగయ్య మృతి

'వేదం'తో టాలీవుడ్​కి పరిచయమైన నటుడు నాగయ్య.. అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details