1. పాఠశాలలో 14 మందికి కరోనా
మంచిర్యాల ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 14 మందికి కరోనా సోకింది. 11 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు వంట నిర్వాహకులు, ఒక విద్యార్థినికి కరోనా వచ్చినట్లు పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 26 వరకు అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 26 వరకు పది రోజుల పాటు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. సభాపతి పోచారం అధ్యక్షతన బీఏసీ సమావేశం కాగా... బడ్జెట్ సమావేశాల అజెండాపై నేతలు చర్చించారు. 18న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సర్కారు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ముందడుగు వేద్దాం
సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ.. రాష్ట్రం ఆవిర్భవించాక అన్ని రంగాల్లోనూ చెప్పుకోదగ్గ పురోభివృద్ధి సాధించిందని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో భాగంగా.. తమిళిసై ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'ప్రైవేటీకరణతో ఉద్యోగులకు నష్టం'
నాలుగు రోజుల విరామం తర్వాత పార్లమెంటు ఉభయసభల సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ ప్రైవేటీకరణపై తెరాస పార్లమెంటరీ పక్ష నేత నామ నాగేశ్వరరావు.. కేంద్రాన్ని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఏప్రిల్ నుంచి కొత్త నియమాలు
ఈ నెలతో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్‌తో ప్రారంభమవనున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్ను నిబంధనల్లో పలు మార్పులు రానున్నాయి. వీటిని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.