1. మోదీ కన్నీటిపర్యంతం
కొవిడ్‌పై పోరులో గతేడాది ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. కరోనా యోధులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, విధుల కోసం సిబ్బందిలో కొందరు ఇంటికి తిరిగివెళ్లలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'ప్రపంచమంతా ఎదురుచూస్తోంది'
ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా కొవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసుకోవటం భారత్‌కు గర్వకారణమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఆశాకిరణం
కరోనాతో ప్రపంచ మానవాళి చిగురుటాకులా వణుకుతున్న పరిస్థితుల్లో... దేశంలో వచ్చిన వ్యాక్సిన్ భవిష్యత్తుకు ఆశాకిరణంలా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. వదంతులు నమ్మొద్దు: సీఎస్
రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. వ్యాక్సినేషన్‌పై వచ్చే వదంతులను ఎవరూ పట్టించుకోవద్దన్న ఆయన... టీకా తొలి విడతలో పోటీ నెలకొందన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'దశలవారీగా అందరికీ వేస్తాం'
రంగారెడ్డి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. తొలి టీకాను ఆరోగ్య కార్యకర్త జయమ్మకు వేశారు. తొలిటీకా తాను తీసుకోవటంపై జయమ్మ ఆనందం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.