తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM - top news today telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @3PM

By

Published : Jan 14, 2021, 3:00 PM IST

1. పతంగులతో హరీశ్​రావు

సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి హరీశ్​రావు పతంగి ఎగరేశారు. సిద్దిపేట జిల్లా మహానగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతోందని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. పండుగపూట విషాదం

పండుగ పూట.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లింగంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. దంపతుల మధ్య చెలరేగిన వివాదం ముదిరి గొడవకు దారితీసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. వైద్యం కోసం డోలీ మోత!

వైద్యం అవసరమైన వారు ఒక్క ఫోన్ చేస్తే చాలు.. అంబులెన్స్ ఇంటికి వచ్చి నేరుగా ఆసుపత్రికి తీసుకువెళ్తుందనేది ప్రచారమే తప్ప ఆ ఛాయలు... ఏపీలోని విశాఖ ఏజెన్సీలో మాత్రం మచ్చుకైనా కనిపించటం లేదు. ఏ గిరిజనుడైనా అనారోగ్యం పాలైతే వారికి డోలీనే దిక్కవుతుంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'తేజస్ ముఖ్య పాత్ర'

డీఆర్​డీవో ఛైర్మన్ సతీశ్​ రెడ్డి సొంత గ్రామం ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో‌ పాలుపంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. బర్డ్​ ఫ్లూ లేదంట!

దిల్లీలోని ఘాజీపుర్​ పౌల్ట్రీ మార్కెట్​లో సేకరించిన నమూనాల్లో.. బర్డ్​ఫ్లూ నెగెటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 100 నమూనాలను పరీక్షించగా.. అన్నింటికీ నెగెటివ్​గా నిర్ధరణ అయినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. డ్రగ్స్​ కేసులో కొత్త కోణం!

ఇటీవల వెలుగుచూసిన డగ్స్​ కేసుకు సంబంధించి ముంబయిలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్​సీబీ). ఈ కేసుతో సంబంధం కలిగి ఉన్నారన్న ఆరోపణలతో రాష్ట్ర మంత్రి, ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​ అల్లుడు సమీర్​ ఖాన్​ను అరెస్ట్​ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 109కి చేరిన కొత్త కేసులు

భారత్​లో కొత్త రకం కరోనా ​కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 109 మందికి యూకే స్ట్రెయిన్​ వైరస్​ నిర్ధరణ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 40 మంది మృతి!

సిరియాపై ఇజ్రాయెల్​ వైమానిక దాడులు జరిపింది. ఆ దేశంలోని ఇరాన్​ సైనిక స్థావరాలు, ఆయుధగారాలే లక్ష్యంగా బాంబులతో విరుచుకుపడింది. దాడుల్లో 9 మంది జవాన్లతో సహా 40 మంది మృతి చెందినట్లు బ్రిటన్​- సిరియా మానవహక్కుల సంస్థ తెలిపింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. యువ క్రికెటర్ దూరం

నిర్ణయాత్మక గబ్బా టెస్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ విల్ పకోస్కీ దూరమయ్యాడు. మూడో టెస్టు ఆడుతూ తగిలిన గాయమే ఇందుకు కారణమని ఆ జట్టు కెప్టెన్ పైన్ చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'సర్కారు వారి పాట' షూటింగ్​!

ప్రిన్స్​ మహేశ్​బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' షూటింగ్​ జనవరి 25 నుంచి ప్రారంభంకానుందని సమాచారం. తొలి షెడ్యూల్​ను దుబాయ్​లో జరపాలని చిత్రబృందం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details