తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 1PM NEWS
టాప్​టెన్ న్యూస్ @1PM

By

Published : Nov 16, 2020, 1:00 PM IST

1. టీఎస్‌బీపాస్‌ను ప్రారంభించిన కేటీఆర్

పట్టణ ప్రాంతాల్లో భవననిర్మాణం, లే అవుట్ల సత్వర అనుమతుల కోసం టీఎస్​-బీపాస్‌ అమలులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిన ఈ వెబ్​సైట్​లో... దరఖాస్తుదారు స్వీయ ధ్రువీకరణతో భవన నిర్మాణ అనుమతి జారీ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. అన్నదాత అరిగోస

సన్నరకం వరిధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం టోకెన్ల కోసం కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలతో సాగుచేసినా... మద్దతు ధర కల్పించడం లేదని వాపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ప్రేమజంట బలవన్మరణం

ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు ససేమిరా అన్నారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఒక్కటి కాకూడదని భావించారు. కానీ.. విడిపోయి బతకలేమని నిర్ధరించుకున్నారు. పెళ్లిలో ఒక్కటి కాలేకపోయినా.. చావులోనైనా ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. చావులో ఒక్కటయ్యారు!

ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఒకే ఆలోచనలు ఉండడంతో స్నేహితులయ్యారు. ఆ బంధం ప్రేమకు దారితీసింది. పెళ్లితో ఒక్కటై.. తుదిశ్వాస వరకూ కలిసే ఉండాలని ఆశపడ్డారు. కానీ... పెద్దలు అడ్డుచెప్పారు. ఆమెకు మరొకరితో వివాహం జరిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. టీకా మూడో దశ ట్రయల్స్​

జాన్సెన్ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా మూడో దశ ట్రయల్స్ నిర్వహించనుంది బ్రిటన్. మొత్తం ఆరు వేల మంది వలంటీర్లను నియమించనుంది. మైనారిటీలు, వృద్ధులనూ ఇందులో భాగస్వామ్యం చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఓకే కుటుంబంలోని ఆరుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'కేదార్​నాథ్​'ను కప్పేసిన మంచు

శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ను మూసివేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్,​ ఆలయ బోర్డు అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఆందోళనలతో అధ్యక్షుడు రాజీనామా

పెరూ అధ్యక్షుడు మాన్యువల్​ మెరినో రాజీనామా చేశారు. ఇప్పటివరకు తాత్కాలిక ప్రెసిడెంట్​గా కొనసాగుతున్న మెరినోపై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఆసీస్ లీగ్​లో కొత్త మార్పులు

త్వరలో ప్రారంభమయ్యే బిగ్​ బాష్​ లీగ్​ 10వ సీజన్​ నియమాల్లో మూడు మార్పులు చేశారు. ప్రత్యామ్నాయ ఆటగాడికి బ్యాటింగ్​, బౌలింగ్​కు అనుమతి ఇవ్వడం సహా రెండు ఓవర్ల బ్యాటింగ్​ పవర్​ప్లే, పది ఓవర్లలో ఉత్తమ స్కోరును చేసిన జట్టుకు ఓ బోనస్​ పాయింట్​ను ఇవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'సెహరి' ఫస్ట్​లుక్

బాలయ్య చేతుల మీదుకగా 'సెహరి' ఫస్ట్​లుక్ విడుదలైంది. కరోనా విషయంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details