తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​10 న్యూస్@7PM - ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

etv bharat top news at 5pm
టాప్​టెన్​ న్యూస్@7PM

By

Published : Jun 18, 2020, 7:01 PM IST

Updated : Jun 18, 2020, 7:12 PM IST

ఆ 18 మంది పెద్దలెవరు?

కరోనా వ్యాప్తి కారణంగా వాయిదాపడ్డ 18 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలవారీగా అధికార, ప్రతిపక్షాల బలాబలాలు ఎలా ఉన్నాయంటే..?

ఉగ్ర ఏరివేత..

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఎన్​కౌంటర్​ అనంతరం.. షోపియాన్​ జిల్లాలో మరోసారి భద్రతా దళాలు, ముష్కరుల మధ్య కాల్పులు జరిగాయి. భారత బలగాలు ఎలా స్పందించాయంటే..?

డ్రాగన్​తో చర్చలు..

భారత్- చైనా.. వరుసగా మూడో రోజు మేజర్ జనరల్స్ స్థాయి చర్చలు జరిపాయి. తూర్పు లద్దాక్​ గాల్వన్ లోయ నుంచి ఇరుదేశాల సైనిక బలగాలను ఉపసంహరించడం, సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం పునరుద్ధణకు కోసం ఏం చేశారు..?

ఘనంగా ఉత్సవాలు

రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు నివాసంలో మాజీ ప్రధాని పీవీ. నరసింహరావు శత జయంతి నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు. పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలు ఎలా నిర్వహించనున్నారంటే..?

పోలీసులే సాక్ష్యం..

ఫ్లాట్​ చూపిస్తానని పిలిచి స్థిరాస్తి వ్యాపారిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన... దుండిగల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. ఇదంతా చూస్తున్న పోలీసులు ఏం చేశారు..?

నాకు తెలియదే..!

తూర్పు లద్దాక్​లో గాల్వన్​ నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటూ చైనా అక్రమంగా నిర్మిస్తున్న ఆనకట్ట గురించి తనకేమీ తెలియదని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ బుకాయించారు. భారత్​-చైనా సైనికుల మధ్య ఘర్షణలో... తప్పంతా భారత్​దేనట!

శుభాకాంక్షల వెల్లువ

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్​ ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపాయి అందులోని సభ్యదేశాలు. ప్రపంచ శాంతి, భద్రత కోసం కలసి పనిచేద్దామంటున్నాయి.

రెండ్రోజులు వర్షం!

రాష్ట్రంలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో ఎక్కడెక్కడ వర్షాలు కురవనున్నాయి..?

జోష్​లో స్టాక్​..

స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్​ ఆరంభంలో కలవరపెట్టినా.. చివరకు అదరగొట్టాయి. మిడ్​ సెషన్ తర్వాత లభించిన కొనుగోళ్ల మద్ధతుతో బలపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఎలా ఉన్నాయంటే..?

నిజమే గెలుస్తది..

సుశాంత్​ మృతి విషయంలో తనపై కేసు పెట్టడంపై నిర్మాత ఏక్తా కపూర్ స్పందించింది. ఎప్పటికైనా గెలిచేది నిజమేనని ఇన్​స్టాలో పేర్కొంది. నిజమేంటి?

Last Updated : Jun 18, 2020, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details