తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana top News: టాప్ న్యూస్​ @ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : May 17, 2022, 9:02 AM IST

  • అందరికీ అందని ఆపన్నహస్తం..

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎంకేర్స్‌’ పథకం అందరికీ అందడం లేదు. దేశవ్యాప్తంగా 6,624 మంది 'పీఎంకేర్స్​'కు దరఖాస్తు చేసుకోగా.. 3,855 దరఖాస్తులను మాత్రమే కేంద్రం ఆమోదించింది. క్షేత్రస్థాయి ధ్రువీకరణ, విచారణ, ఇతర సాంకేతిక కారణాలతో మిగిలిన దరఖాస్తులకు కేంద్రం ఆమోదం తెలపడం లేదు.

  • ఆ కాలేజీలకు షాక్‌..

ఉపాధ్యాయ విద్య కళాశాలలకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి గట్టి షాక్​ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 6 వేల కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టకూడదని నిర్ణయించింది. ఇందులో కొన్ని ప్రభుత్వ కళాశాలలూ ఉండటం గమనార్హం.

  • వడ్డీతో సహా రూ.16 లక్షలు కట్టాల్సిందే..!!

వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ చిన్నారి తన అరచేతిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన 19 ఏళ్ల క్రితం జరిగింది. ఆమె 20 ఏళ్ల పోరాటానికి నేడు ఫలితం దక్కింది. వడ్డీతో సహా రూ. 16 లక్షలు కట్టాల్సిందేనని... వైద్యుడికి, బీమా సంస్థకు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

  • పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై రేపు సీఎం సమీక్ష..

CM Review Meeting: రేపు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్​ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మంత్రి వర్గం, అధికారులతో కేసీఆర్‌ చర్చించనున్నారు. భవిష్యత్​ కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

  • ఫోన్​ ట్యాపింగ్​పై దర్యాప్తు జరపండి..

TDP MPs letter to Amit shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెదేపా ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌.. లేఖలు రాశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌, ఫోన్ల ట్యాపింగ్‌ వంటి విషయాల్లో చిత్తూరు ఎస్పీ పాత్ర అనుమానాస్పదంగా ఉందని లేఖల్లో ఎంపీలు పేర్కొన్నారు.

  • నిత్యం యవ్వనంగా ఉండాలా?

వయసు మీద పడటం అనివార్యమే కావచ్చు. మరి ఎంత బాగా వృద్ధాప్యం వస్తోందో ఎప్పుడైనా గమనించారా? ముసలితనం ముంచుకురావటంలో బాగోగులేంటని ఆశ్చర్యపోకండి. మనమంతా పైకి చెప్పుకునే వయసు, శరీరంలో కొనసాగే వయసు వేరు మరి. అద్దంలో చూసుకున్నప్పుడు జుట్టు తెల్లబడటం, చర్మం ముడతల వంటి వృద్ధాప్య ఛాయలు తెలుస్తూనే ఉంటాయి.

  • 2014 నుంచి అదానీ సామ్రాజ్య విస్తరణ ఇలా..

Gautam Adani Business: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మెజార్టీ వాటా.. నౌకాశ్రయాలు, విద్యుత్‌, సిమెంటు రంగాల్లో హవా.. ఇదీ 2014 నుంచి గౌతమ్ అదానీ ప్రస్థానం. ఆసియా అపర కుబేరుడిగా ఎదిగిన అదానీ.. 2014 నుంచి తన సామ్రాజ్యాన్ని ప్రధానంగా 'కొనుగోళ్ల' ద్వారానే విస్తరించారు. వాటిల్లో ఏమేం ఉన్నాయంటే..

  • పాపం గజరాజు.. వరద ధాటికి నదిలో కొట్టుకుపోతూ..

అసోంలో వరదల ధాటికి మూగజీవాలకు ఇక్కట్లు తప్పడం లేదు. వరద ఉద్ధృతికి ఓ గజరాజు నిస్సహాయ స్థితిలో నదిలో కొట్టుకుపోయింది. ఒడ్డుకు చేరే అవకాశం కూడా లేనంత తీవ్రంగా నది ప్రవహిస్తోంది. దీంతో అధికారులు, స్థానికులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేకపోయారు.

  • నిఖత్‌ పంచ్​.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌లోకి..

తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ వేదికపై అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని అందుకుంది. బాక్సింగ్‌లో అత్యున్నత టోర్నీ అయిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌ చేరడం ద్వారా ఆమె పతకం ఖరారు చేసుకుంది. ఇంకో రెండు విజయాలు సాధిస్తే ప్రపంచ ఛాంపియన్‌ అవుతుంది.

  • ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్​హాసన్​!

ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్​ కాంబినేషన్​లో వస్తున్న సినిమాకు సంబంధించి క్రేజీ రూమర్​ ఒకటి సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కమల్​ హాసన్​ ఒప్పించేందుకు ప్రశాంత్​ సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details