కేసీఆర్ సమీక్ష
వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రాష్ట్రానికి పెట్టుబడులు!
రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని కైటెక్స్ గ్రూపు యోచిస్తోంది. మంత్రి కేటీఆర్‌తో కైటెక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. జౌళి రంగంలో పెట్టుబడుల యోచనపై మంత్రితో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
విధుల నుంచి తొలగించిన నర్సుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గాంధీభవన్ నుంచి డీఎంఈ కార్యాలయానికి ర్యాలీ తలపెట్టగా... పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్ వద్దే నర్సులను అడ్డుకోగా.. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు నర్సులను అరెస్టు చేయగా.. కొందరు యువతులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మంత్రి ఎర్రబెల్లికి నిరసన సెగ
పల్లె ప్రగతి సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చుక్కెదురైంది. గ్రామంలో అభివృద్ధి పనుల ఆలస్యంపై మంత్రిని గ్రామస్థులు ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ఎర్రబెల్లి అడగ్గా.. ఆయన పట్టించుకోకపోతే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. కరీంనగర్ జిల్లా పెద్ద పాపయ్య పల్లి పల్లె ప్రగతి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కప్పా కలకలం
ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు కరోనా కప్పా రకం(Kappa Variant) కేసులు వెలుగుచూశాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.