ఘోర ప్రమాదం
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివార్లలోని ఓ కర్మాగారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తెదేపాకు రమణ గుడ్‌బై
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ తీర్థం పుచ్చుకోవడంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. పార్టీని వీడి తెరాసలో చేరే అంశంపై అనుచరులతో చర్చిస్తానని గురువారం రోజున రమణ తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర తెదేపా అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అత్యద్భుతంగా యాదాద్రి
శ్రీలక్ష్మీనరసింహస్వామి(sri lakshmi narasimha swamy) క్షేత్రం అత్యద్భుతంగా ముస్తాబవుతోంది. ప్రధాన ఆలయ తొలి ద్వారానికి ఇత్తడి తొడుగులు అమర్చుతున్నారు. పునర్నిర్మాణ పనులను యాడా(YADA) వేగవంతం చేసింది. వారం రోజుల్లో తాపడం పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనా ప్రభావం తక్కువే!
కరోనా కారణంగా చిన్నారులు మృతి చెందే ప్రమాదం చాలా తక్కువని ఓ పరిశోధన ద్వారా తేలింది. పిల్లలు, యువతలో కరోనా వల్ల తీవ్ర అనారోగ్యం కలిగే అవకాశం కూడా చాలా తక్కువేనని వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు
దేశవ్యాప్తంగా 1500 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆక్సిజన్ సరఫరా సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. పీఎం కేర్స్ నిధుల ద్వారా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.