'వైఎస్ నరరూప రాక్షసుడు'
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్ పాలనపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిప్పులు చెరిగారు. పోతిరెడ్డిపాడుకు డబుల్ దోపిడీ చేసేలా ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓ ముఖ్యమంత్రి తెలుగుగంగ పేరుతో నీళ్లు తరలిస్తే ఇప్పుడు కృష్ణా బేసిన్ పరిధిలోలేని నెల్లూరుకు తీసుకెళ్తామనడం సరికాదన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.. మీడియా సమావేశంలో ఏపీ ప్రభుత్వం, వైఎస్ పాలనపై మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బోనాలకు సిద్ధం
ఈ ఏడు భాగ్యనగరంలో బోనాల పండగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే.. ప్రజలు వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏపీలో తొలి డెల్టా కేసు
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసు (Delta pluse case) గుర్తించామని ఏపీ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. బాధితునికి చికిత్స కూడా పూర్తైందని ఆయన అన్నారు. ఏపీలో కొవిడ్ పరిస్థితిపై చర్చించామని.. లాక్‌డౌన్ అంశంపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నో ఛేంజ్!
జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఎన్నికలు నిర్వహించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే.. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉండనున్నాయి? అధికరణ 370 రద్దుకు మునుపటి పరిస్థితులు వస్తాయా అంటే స్పష్టత లేదు. అధికారాలు, శాంతి భద్రతలు కేంద్రం పరిధిలోనే ఉండే అవకాశాలున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఎలా నియంత్రిస్తారు?'
కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌ను ఎలా నియంత్రిస్తారో తెలపాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. కేంద్రాన్ని ప్రశ్నించారు. వైరస్‌ను అడ్డుకునేందుకు ఇప్పటివరకు పెద్దఎత్తున పరీక్షలు ఎందుకు చేపట్టడం లేదో సమాధానం చెప్పాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.