ప్రధాని ప్రశంసలు
హైదరాబాద్ విద్యార్థులపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల జల్లు కురిపించారు. దిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభను చూసి మురిసిపోయిన ప్రధాని.. వారి సృజనాత్మకతను కొనియాడారు. ఆటలోనూ.. చదువును చేర్చిన పిల్లల విజ్ఞానాన్ని మోదీ మెచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కోటికి చేరువలో వ్యాక్సినేషన్
రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ వెలుగు చూడలేదని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 97 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. ఇందులో 83 లక్షల మంది మెుదటి డోసు వారు ఉన్నట్లు స్పష్టం చేశారు. మెుత్తం 2.2 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని డీహెచ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'నివేదిక సమర్పించండి'
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు కస్టోడియల్ డెత్‌పై నివేదిక సమర్పించాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ బహుజన విద్యార్థి సమాఖ్య ఎస్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
డెల్టాప్లస్ తొలిమరణం!
మధ్యప్రదేశ్‌లో డెల్టాప్లస్ వేరియంట్‌తో తొలి మరణం నమోదైనట్లు తేలింది. నెలరోజుల క్రితమే మృతి చెందిన ఓ మహిళకు ఈ వేరియంట్ సోకినట్లు నిపుణులు గుర్తించారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం ఐదుగురికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తీర్పు వాయిదా
బంగాల్లోని నందిగ్రామ్ ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తూ సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది కోల్‌కతా హైకోర్టు. మరో బెంచ్‌కు తమ పిటిషన్‌ను అప్పగించాలని కోరేందుకు పిటిషనర్‌కు పూర్తి హక్కు ఉంటుందని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.