వారం రోజుల్లో భాజపాలోకి...
వారం రోజుల్లో దిల్లీ వెళ్లి భాజపాలో చేరుతానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం మీడియా ప్రతినిధులతో చేసిన చిట్‌చాట్‌లో ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఆ టీకాలను కొనుగోలు చేయాలి
ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా తెలంగాణ ఉన్నా, కేంద్ర అనాలోచిత నిర్ణయాల వల్లే దేశంలో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. ఇతర దేశాల్లో నిరుపయోగంగా ఉన్న ఆస్ట్రాజెనికా టీకాలను మన దేశానికి దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
తెలంగాణ హైకోర్టు అసహనం
తెలుగు రాష్ట్రాల హోంశాఖలపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర భద్రత కమిషన్, ప్రజా ఫిర్యాదుల సంస్థ ఏర్పాటులో జాప్యంపై ఆగ్రహించింది. కోర్టు ఆదేశాలు నాలుగు వారాల్లో అమలు చేయాలని హోంశాఖలను ఆదేశించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'ఈటల కూడా అదే పాటించారు'
తెరాసలో చేరిన ఎంతో మంది వెళ్లిపోయారని.. వెళ్లేటప్పుడు కేసీఆర్‌పై విమర్శలు చేశారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈటల కూడా అదే పాటించారని అన్నారు. సీఎం తెచ్చిన సంక్షేమ పథకాలపై అసంతృప్తి ఉంటే మంత్రి వర్గంలో చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. తెరాస, కేసీఆర్‌పై అనవసరంగా నోరు పారేసుకోవద్దని హెచ్చరించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఎస్సై రాసలీలలు
జవహర్‌నగర్ పీఎస్ అనిల్ రాసలీలలు సాగించారు. ఎస్సైతో పాటు మహిళను తిమ్మాయిపల్లి సైలెంట్ వరల్డ్ రిసార్ట్స్‌లో కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.