నైరుతి రుతుపవనాల రాక రేపే!
కేరళను గురువారం నైరుతి పవనాలు తాకనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పరిస్థితులు వర్షాలకు అనుగుణంగా ఉన్నాయని.. ఈ క్రమంలోనే నైరుతి పవనాలు కూడా కేరళ చేరతాయని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఆకాశంలో అద్భుతం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశంలో సుందర దృశ్యం ఆవిష్కృతం అయింది. సూర్యుని చుట్టూ ఇంద్ర ధనస్సు మాదిరిగా వలయం ఏర్పడింది. దీన్ని హలో (HALO) అంటారని చెబుతున్నారు. ఇలా ఏర్పడితే ఆ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతుల విశ్వసిస్తుంటారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చారు'
తెలంగాణలో అవినీతి తారస్థాయికి చేరిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందన్నారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేట్లు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
భార్యను నరికి... వీధిలోకి లాక్కెళ్లి..
కట్టుకున్న భార్యనే గొడ్డలితో నరికి హత్యచేశాడో వ్యక్తి. ఆ మృతదేహాన్ని వీధిలోకి లాక్కెళ్లి భయానక వాతావరణం సృష్టించాడు. ఈ ఘటనలో అతడి కుమారుడూ ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం నిందితుడు.. పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'అన్‌ఫాలో' చేసిన రాహుల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా.. 50 మంది ట్విట్టర్ ఖాతాలను అనుసరించడం మానేశారు. ఇందులో ఆయన సన్నిహితులు, జర్నలిస్టులు, ఇతర ప్రభావశీలురు ఉన్నారు. అందరూ దీని గురించి ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.