అదనపు ర్యాంపులు
హైదరాబాద్ నగరంలో శంషాబాద్ ఎయిర్పోర్టు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే కోసం నిర్మించిన అదనపు ర్యాంపులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.22 కోట్లతో అదనంగా రెండు ర్యాంపులను హెచ్ఎండీఏ నిర్మించినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సీఎంకు కేంద్రమంత్రి లేఖ
రాష్ట్రంలో అర్హులందరికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీని అమలు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. వెంటనే పంపిణీకి చర్యలు చేపట్టాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సీఎం కేసీఆర్ సమీక్ష
వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేపట్టారు. మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులతో భేటీ అయ్యారు. వానంకాలం పంటల సాగుపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నివేదికలో ఏముంది..!
ఆనందయ్య ఔషదంపై నేడు ఆయుష్ నివేదిక వెలువడనుంది. ఆనందయ్య మందు వాడిన వారికి ఎటువంటి నష్టం కలగలేదని ఆయుష్ ఉన్నతస్థాయి అధికారుల బృందం ఇప్పటికే ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తల్లి మరణం తట్టుకోలేక..
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో యువకుడి ఆత్మహత్య తీవ్ర విషాదం నింపింది. ఆత్మహత్యకు కారణాలు వివరిస్తూ శ్రీహరి అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని చెరువులో దూకి బలవన్మరణం చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం కరోనాతో తన తల్లి మరణించిందని వీడియోలో వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.