తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @3PM

By

Published : May 6, 2021, 3:00 PM IST

కేంద్ర మంత్రి కాన్వాయ్​పై దాడి

కేంద్ర మంత్రి మురళీధరన్​ కాన్వాయ్​పై బంగాల్​లో దాడి జరిగింది. 'టీఎంసీ గూండాలే' ఈ దాడికి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'మమతకు యూపీఏ పగ్గాలు ఇవ్వాలి'

ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలతో తృణమూల్​ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి యూపీఏ పగ్గాలు అప్పగించాలని భాజపాయేతర ప్రాంతీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీనికి కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతల నుంచీ మద్దతు లభిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నర్సింగ్​ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్​లోని ప్రగతి భవన్‌ వద్ద నర్సింగ్‌ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న వారికి పోస్టింగులు ఇవ్వాలని నిరసన చేశారు. 3,311 పోస్టులకు గాను 2,418 మాత్రమే భర్తీ చేశారన్న అభ్యర్థులు... మిగిలిన 893 మందికి పోస్టింగులు ఇవ్వాలని సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ర్యాపిడ్​ ఫీవర్​ సర్వేపై ఆరా

జీహెచ్​ఎంసీ పరిధిలోని బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్‌ను సీఎస్ సోమేశ్​ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ సిబ్బంది పనితీరు, ర్యాపిడ్ ఫీవర్ సర్వే వివరాలపై ఆరా తీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆకలి సంక్షోభం

2020లో 15.5 కోట్ల మంది తీవ్రమైన ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని అంతర్జాతీయ సంస్థల నివేదికలు వెల్లడించాయి. 2021లో ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించాయి. నిధులు లేకపోవడం వల్ల సహాయ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో జరగడం లేదని తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఎకోఫ్రెండ్లీ మాస్క్​

మాస్కులు ధరిస్తూ, స్వీయ నియంత్రణ పాటించడమే వైరస్‌ నుంచి కాపాడుకునే మార్గం. అయితే.. వాడిపారేసిన మాస్కులతో పర్యావరణానికి ఉన్న ముప్పు అంతా ఇంతా కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వాతావరణానికి చేటు చేయకపోగా.. వాడేసిన మాస్కుల్లో నుంచి కూరగాయల మొక్కలు మొలిస్తే? వినడానికే కొత్తగా ఉంది కదూ..? కర్ణాటకకు చెందిన 'పేపర్‌ సీడ్' అనే సంస్థ పర్యావరణహిత మాస్కులను రూపొందించింది. ఆ మాస్కులతో కలిగే ప్రయోజనాలను మీరూ తెలుసుకోండి మరి.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బజాజ్​ హెల్త్​ కేర్​ నుంచి కరోనా ఔషధం

కరోనా చికిత్సకు త్వరలో మరో ఔషధం అందుబాటులోకి రానుంది. బజాజ్ హెల్త్​కేర్​ అభివృద్ధి చేసిన కరోనా ఔషధానికి డీసీజీఐ తాజాగా ఆమోదముద్ర వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'భారత్​ను చూసి నేర్చుకోవాలి'

విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు.. పాకిస్థాన్ దౌత్య కార్యాలయాల కంటే మెరుగ్గా పనిచేస్తున్నాయని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తమ పౌరుల కోసం చక్కగా పనిచేసే భారత దౌత్యవేత్తలను చూసి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్థాన్ రాయబారులు నేర్చుకోవాలని ఇమ్రాన్ హితబోధ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సతీమణికి బుమ్రా లవ్​లీ విషెస్​

టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేషన్ పుట్టినరోజు ఈరోజు. ఈ నేపథ్యంలో లవ్​లీ విషెస్ తెలిపాడు బుమ్రా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

"హిట్​ 2' చేయకపోవడానికి కారణమదే!'

హీరో నాని నిర్మాణంలో రూపొందుతోన్న 'హిట్​ 2' సినిమాను వదులుకోవడానికి ప్రధానకారణం 'పాగల్​' సినిమా అని అంటున్నారు యువ కథానాయకుడు విశ్వక్​సేన్. 'పాగల్​' షూటింగ్​ నేపథ్యంలో 'హిట్​ 2'కు డేట్లు కేటాయించలేక పోవడం వల్లే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు.. ఆలీతో సరదాగా కార్యక్రమంలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details