తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @5PM

By

Published : May 3, 2021, 5:00 PM IST

కాన్వాయ్​ సరెండర్​

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు కాన్వాయ్‌ను సరెండర్​ చేశారు. ఎమ్మెల్యేగా ఇచ్చే గన్‌మెన్లను మినహా సెక్యూరిటీని వెనక్కి పంపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రాజధానిలో వర్షం

సూర్యుడి ప్రతాపానికి కాస్త ఉపశమనం లభించింది. ఉదయం నుంచి ఎండలు మండుతుండగా.. మధ్యాహ్నం హైదరాబాద్​ నగరంలో కురిసిన వర్షానికి వాతావరణం కాస్త చల్లబడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నీట్‌ పీజీ పరీక్ష వాయిదా

కరోనా రెండో దఫా విజృంభణతో దేశంలోని కొన్ని చొట్ల వైద్య, ఆరోగ్య సిబ్బంది కొరత సహా.. అందుబాటులో ఉన్నవారిపై పనిభారం, ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో.. మానవ వనరుల కొరతపై ఆదివారం సమీక్ష నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మమత అనుమానాలు

నందిగ్రామ్​లో నాటకీయ పరిణామాల మధ్య భాజపా అభ్యర్థి సువేందు అధికారి గెలుపొందడంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. తెరవెనుక ఏదో జరిగి, పరిస్థితి తారుమారైందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అసెంబ్లీలో మామా అల్లుళ్ల సందడి

ఇప్పటివరకు కేరళ అసెంబ్లీలో తమ కుమారులు, కూతుళ్లతో కలిసి రాజకీయ నేతలు శాసనసభలో పనిచేశారు. కానీ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మామా అల్లుళ్లు కలిసి ఒకేసారి శాసనసభలోకి అడుగుపెట్టనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఫైజర్​ ఔషధ సాయం!

కరోనాపై పోరులో భారత్​కు దిగ్గజ కంపెనీలు అండగా నిలుస్తున్నాయి. ప్రముఖ టీకా ఉత్పత్తిదారు ఫైజర్​ రూ. 510 కోట్లు విలువ చేసే ఔషధాలను భారత్​కు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు దేశీయంగా అతిపెద్ద బ్యాంక్​ అయిన ఎస్​బీఐ తన వంతు సాయంగా రూ.71 కోట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బంగారం, వెండి మరింత ప్రియం

పసిడి ధర మరింత ప్రియమైంది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర సోమవారం రూ.310 పెరిగింది. వెండి కిలోకు ఏకంగా రూ.67 వేల మార్క్ దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మిశ్రమంగా ముగిసిన మార్కెట్లు

ఒడుదొడుకుల సెషన్​లో మిశ్రమంగా ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 64 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ ఫ్లాట్​గా ముగిసింది. ఆటో, ఫార్మా, ఎఫ్​ఎంసీజీ షేర్లు రాణించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తిసారా పెరీరా​ వీడ్కోలు

శ్రీలంక ఆల్​రౌండర్​ తిసారా పెరీరా.. అంతర్జాతీయ కెరీర్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు. లంక తరఫున 2009 నుంచి ఇతడు ఆడుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సినిమా అప్​డేట్స్​

కొత్త సినిమాల విశేషాలు వచ్చేశాయి. ఇందులో వరుణ్ సందేశ్ 'ఇందువదన', అల్తాఫ్ హాసన్ 'బట్టల రామస్వామి బయోపిక్కు' చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details