ఏపీలో పాక్షిక కర్ఫ్యూ
ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంపై కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఉ.6 నుంచి మ.12 వరకే దుకాణాలకు అనుమతిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఆ నివేదిక పచ్చి అబద్ధం'
ఈటల రాజేందర్ తనపై చేసిన ఆరోపణలపై మీడియా సమావేశంలో స్పందించారు. తాను ప్రేమతోనే లొంగుతాను తప్పా.. భయపెడితే లొంగిపోయే వాడిని కాదని హెచ్చరించారు. చావునైనా భరిస్తా.. ఆత్మాభిమానాన్ని అమ్ముకోనని ప్రకటించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఐఏఎస్‌లతో కమిటీ
మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహా.. మరికొందరు దేవాలయ భూములు ఆక్రమించారంటూ వస్తున్న కథనాలపై రాష్ట్రప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ మండలం దేవరయాంజల్ సీతారామ ఆలయ భూముల ఆక్రమణలపై విచారణకు నలుగురు ఐఏఎస్‌లతో కమిటీని నియమించింది. అన్ని అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తెరాస ఖాతాలో అచ్చంపేట
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయకేతనం ఎగరవేసింది. మొత్తం 20 వార్డుల్లో ... తెరాస 13 స్థానాలు గెలుచుకుని మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్నీ కైవసం చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
విజయోత్సవ ర్యాలీలపై నిషేధం
ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలపై ఎస్‌ఈసీ నిషేధం విధించింది. కౌంటింగ్ హాల్, బయట జనసమూహాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. కౌంటింగ్ ప్రక్రియలో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.