తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @3PM

By

Published : May 2, 2021, 3:01 PM IST

తెరాస విజయం

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస విజయం సాధించింది. తెరాస అభ్యర్థి నోముల భగత్ గెలుపొందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆంక్షలు బేఖాతరు

కొవిడ్​ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు సంబరాలు జరపుకుంటున్నారు. గుంపులుగా చేరి విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. నిబంధనలు ఉల్లంఘించినవారిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని అన్ని రాష్ట్రాల కార్యదర్శులను ఎన్నికల సంఘం ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉత్కంఠగా నందిగ్రామ్​ ఫలితాలు

నందిగ్రామ్​లో సీఎం మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. రౌండ్లు మారే కొద్దీ ఆధిక్యం మారుతోంది. ఎవరికీ అధిక్యం రాకుండా విజయం దోబూచులాడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

దూసుకెళ్తున్న డీఎంకే

సర్వేల అంచనాలను నిజం చేస్తూ తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. సీఎం పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే కూటమి వెనుకంజలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కేరళలో కామ్రేడ్ల హవా

కేరళలో కామ్రేడ్లు పూర్తి ఆధిక్యం కనబరుస్తున్నారు. సీఎం పినరయి విజయన్​ నేతృత్వంలోని ఎల్​డీఎఫ్ అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. యూడీఎఫ్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అసోంలో అధికారం దిశగా భాజపా

అసోం​ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ దూసుకుపోతోంది. కాంగ్రెస్​ రెండో స్థానంలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మూడో దశ టీకా

మూడో దశ టీకా పంపిణీ కార్యక్రమంలో తొలి రోజే దేశవ్యాప్తంగా 86వేల మందికి పైగా వ్యాక్సిన్​ తీసుకున్నారు. ఈ క్రతువులో 11 రాష్ట్రాలు భాగమైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రాష్ట్రానికి వర్షసూచన

తెలంగాణలో నేడు, రేపు వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా వడగండ్లు మినహా ఇదే పరిస్థితి ఉండవచ్చని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

క్రికెటర్ రహానె విరాళం

టీమ్​ఇండియా ఆటగాడు రహానె.. కరోనా బాధితుల కోసం తనవంతు సాయం ప్రకటించాడు. 30 ఆక్సిజన్​ కాన్సట్రేటర్స్​ను ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ప్రకటించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'బాయ్​ ఫ్రెండ్​ ఫర్​ హైర్​'

యువ నటీనటులు విశ్వంత్​, మాళవిక జంటగా నటిస్తోన్న చిత్రం 'బాయ్​ ఫ్రెండ్​ ఫర్​ హైర్​'. రొమాంటిక్​ కామెడీ ఎంటర్​టైనర్​ నేపథ్యంతో తెరకెక్కనున్న సినిమా టీజర్​ను ఆదివారం విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details