తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @5PM

By

Published : May 1, 2021, 4:59 PM IST

నిమిషానికి ముగ్గురికి కరోనా

కరోనా మహమ్మారి రాష్ట్రంలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఒక్క నెలలోనే సుమారు లక్షా 30 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నిమిషానికి కనీసం ముగ్గురికి మహమ్మారి సోకుతోందని వైద్యారోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'జాగ్రత్తగా వ్యవహరించాలి'

కరోనా చికిత్స, పడకలు, ఔషధాలు, ఆక్సిజన్, వ్యాక్సిన్ల విషయంలో ఏ మాత్రం లోపం రానీయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​ను ఆదేశించారు. కొవిడ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు సమీక్షించి స్వయంగా పర్యవేక్షించాలని నిర్దేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వర్షసూచన

రాగల మూడ్రోజులు తెలంగాణలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో వడగండ్లు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఈటలను బలి చేయాలని..

ఈటల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డాడని వార్తలు రావడం ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నాయని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రపూరితంగా ఈటల రాజేందర్​పై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరోనాపై గెలిచిన వృద్ధురాలు

మహారాష్ట్రకు చెందిన ఓ వృద్ధురాలు 102 ఏళ్ల వయసులో కరోనాపై విజయం సాధించారు. కరోనా సోకిందన్న ఆందోళన కన్నా ధైర్యంగా ఉండటమే ముఖ్యమని చాటిచెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కాంగ్రెస్ 'హెల్ప్​లైన్'

దేశంలో కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ. కొవిడ్ బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'రాష్ట్రాల వద్ద 79లక్షల టీకాలు'

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 79 లక్షలకు పైగా కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. వచ్చే మూడు రోజుల్లో 17 లక్షలకు పైగా డోసులు సరఫరా చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

భారత్​పై నేపాల్, ఐర్లాండ్ ఆంక్షలు

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతున్న క్రమంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్​తో సంబంధం ఉన్న 22 సరిహద్దు పాయింట్లను మూసివేయాలని నిర్ణయించింది. మరోవైపు.. ఐర్లాండ్​ సైతం భారత్​ నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్​లో ఉండాలని ఆంక్షలు విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సన్​రైజర్స్ కెప్టెన్​గా​ విలియమ్సన్

డేవిడ్ వార్నర్​ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది సన్​రైజర్స్ హైదరాబాద్. అలాగే విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్​ను కూడా మారుస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రాజస్థాన్ రాయల్స్​తో జరిగే మ్యాచ్​లో వార్నర్​ ఉంటాడా?లేడా? అనేది సందేహంగా మారింది. తర్వాత మ్యాచ్​ నుంచి కేన్ విలియమ్సన్​ కెప్టెన్​గా ఉంటాడంటూ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'రాజా ది గ్రేట్‌'కు సీక్వెల్‌?

అనిల్ ​రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన 'రాజా ది గ్రేట్‌' సినిమాకు సీక్వెల్​ తెరకెక్కనుందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో కానీ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details