వైద్యారోగ్య శాఖ సీఎంకు బదిలీ
తెరాస సీనియర్ నేత ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈటలను ఆయన నిర్వహిస్తున్న వైద్యారోగ్య శాఖను కొద్దిసేపటి క్రితం తప్పించింది. కరోనా నేపథ్యంలో అత్యంత సున్నితమైన ఆ శాఖను ముఖ్యమంత్రికి బదిలీ చేసింది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ప్రణాళికా ప్రకారమే'
నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు యావత్ తెలంగాణ భావిస్తోందని ఈటల రాజేందర్ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎవరిని కలవనని స్పష్టం చేశారు. అంతా ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారన్నారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మేడే శుభాకాంక్షలు
మేడే సందర్భంగా శ్రమ జీవులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కష్టజీవుల చెమట చుక్కలతోనే అభివృద్ధి సాధ్యమని కొనియాడారు. రాష్ట్రంలో ఆదర్శవంతమైన కార్మిక, కర్షక విధానాలు అమలవుతున్నాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'జాతీయ విధానాన్ని రూపొందించాలి'
భారత్‌లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు జాతీయ విధానం రూపొందించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. వైరస్‌పై పోరాటంలో మోదీ సర్కార్‌తో కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'లాక్డౌన్ వార్తలు అవాస్తవం'
కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్డౌన్ విధింపుపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) స్పష్టం చేసింది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పీఐబీ 'ఫ్యాక్ట్ చెక్' చేసి పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.