రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను మరో వారం పొడిగించారు. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనా పరిస్థితులపై విచారణ
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. మే 8 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగించినట్లు ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్రంలో ఇంకా ఏమైనా ఎన్నికలు జరగాల్సి ఉన్నాయా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రశాంతంగా పోలింగ్
రాష్ట్రంలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్, సిద్దిపేటలో ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీటితో పాటు వివిధ మున్సిపాలిటీల్లోని వార్డులకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనాపై భయాలొద్దు..
కరోనా కమ్ముకుంటోంది. వయసుతో సంబంధం లేకుండా సోకుతుంది. కుటుంబంలో ఒక్కరికి వైరస్ సోకితే మిగతా వారికీ సులభంగా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో జనంలో ఎన్నో భయాలు నెలకొంటున్నాయి. ఒకరికి వైరస్ సోకితే.. అందరూ ఐసోలేషన్‌లో ఉండాలా? పాజిటివ్ వచ్చినవారు అందరూ కలిసి ఉండొచ్చా? ఇంట్లో కూడా మాస్క్ ధరించాలా? ఇలా ఎన్నో సందేహాలు తలలో తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ఈనాడు' పలువురు వైద్య నిపుణులను సంప్రదించింది. వారు అందించిన విలువైన సూచనలు మీ కోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ లక్షణాలున్నాయా..!
కరోనా రెండో దశలో వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఈ దశలో పాత లక్షణాలతో పాటు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం తప్పందంటున్నారు వైద్యులు. మరి ఆ కొత్త లక్షణాలేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వ్యాక్సిన్ వేయించుకున్నా వస్తుందా?
వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా వస్తుందా? అనే భయాలు చాలామందిలో ఉన్నాయి. అయితే మహమ్మారిని అంతం చేసేందుకు అందుబాటులోకి వచ్చిన వాక్సిన్లు సంజీవని లాంటివనే చెప్పాలి. టీకాలపై అనుమానాలు, అపోహలు, భయాలు అనవసరం అంటున్నారు వైద్య నిపుణులు. టీకా తీసుకున్నప్పటికీ కరోనా సోకే అవకాశాలు లేకపోలేదని.. అయితే మహమ్మారి తీవ్రతను అరికట్టి, ప్రాణాలు నిలపడానికి టీకాలు చురుకైన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అధికార పార్టీలదే హవా..!
శాసనసభ ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అందరి కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షించిన బంగాల్‌లో పోరు ఉత్కంఠభరితంగా ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్ తేల్చాయి. కేరళ, అసోంలో అధికార పార్టీలదే మళ్లీ హవా కొనసాగనుందని ఈటీవీ భారత్ అంచనా వేసింది. తమిళనాడులో డీఎంకే సత్తా చాటుతుందని, పుదుచ్చేరి భాజపా నెగ్గుతుందని సర్వేలో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రెమ్‌డెసివిర్ వయల్స్ దిగుమతి
కరోనా రోగుల చికిత్సకు వినియోగించే రెమ్‌డెసివిర్ ఔషధ కొరత తీర్చేందుకు.. కేంద్రం 4.5 లక్షల వయల్స్‌ను దిగుమతి చేసుకోనుంది. ప్రభుత్వ రంగ ఆరోగ్య సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ ఈ మొత్తాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 75 వేల వయల్స్ శుక్రవారమే భారత్‌కు చేరుకోవచ్చని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మంచి మనసు చాటుకున్న క్రికెటర్
ఐపీఎల్లో ఆడుతున్న విండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ మంచి మనసు చాటుకున్నాడు. ఈ లీగ్‌లో ఆడగా వచ్చిన జీతంలో కొంత మొత్తాన్ని కరోనా బాధితుల కోసం విరాళంగా అందించనున్నట్లు ప్రకటించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రణ్‌ధీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్
హీరోయిన్ కరీనా కపూర్ తండ్రి రణ్‌ధీర్ కపూర్.. కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడిచాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.