'మరింత జాగ్రత్త అవసరం'
గత వారం నుంచి రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడుతున్నాయని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. కరోనా వేళ ప్రజలందరూ సహకరిస్తున్నారని... రాష్ట్రంలో కేసుల్లో స్థిరత్వం ఉందన్నారు. వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకమన్న డీహెచ్ శ్రీనివాస్... వచ్చేది పెళ్లిళ్లు, పండగల సీజన్ కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వర్ష సూచన
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'సహాయక చర్యలకు సిద్ధం'
దేశంలో కొవిడ్ పోరులో అవసరమైన సహాయ చర్యలు చేపట్టేందుకు తాము 24x7 సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) తెలిపింది. కరోనాపై పోరులో తాము చేస్తున్న ప్రయత్నాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పిడుగుపాటుకు బలి
కర్ణాటక చిక్కబల్లపురలో పిడుగుపాటు కారణంగా ఒకే కుటుంబంలో నలుగురు మరణించారు. మరో ముగ్గురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రాణాలు తీసిన కల్తీ మద్యం!
ఉత్తర్ ప్రదేశ్లో కల్తీ మద్యం తాగి ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. పలువురు ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.