'ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేయొద్దు'
అనధికార లేఅవుట్‌లు, భవనాల క్రమబద్ధీకరణపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎల్ఆర్ఎస్‌పై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించగా... సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేయొద్దని హైకోర్టు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మామిడి ఎగుమతులకు ప్రోత్సాహం
మామిడి ఉత్పత్తి పెరుగుతున్నందున ఎగుమతుల ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటి వరకు చేస్తున్న ఎగుమతులతో పాటు మరింత పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన అనుబంధ శాఖల అధికారులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'సీఎం ఎందుకు చెప్పడం లేదు'
కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు, మరణాలు తగ్గించి చూపిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ప్రాణాలు కాపాడుతాం'
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. పీపీఈ కిట్ వేసుకుని కరోనా బాధితులను పరామర్శించారు. ఆస్పత్రిలో 650 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 400 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'విజయోత్సవ ర్యాలీలు నిషేధం'
మినీ పురపోరు ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. గెలుపొందిన అభ్యర్థులు, వారి పార్టీలు, అనుచరులు ఎలాంటి ర్యాలీలు చేపట్టరాదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.