తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @3PM

By

Published : Apr 25, 2021, 2:56 PM IST

'ప్రజల వల్లే సాధ్యం'

ప్రజల వల్లే కరోనా నియంత్రణ సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్, పడకల కొరత లేదని తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులు కొవిడ్ నియంత్రణకు మళ్లించుకునేలా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆస్పత్రులు ఎంత భద్రం!

దేశంలో పలు ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం వల్ల రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలు.. ఆస్పత్రులు ఎంత వరకు భద్రంగా ఉన్నాయని ఆరా తీస్తున్నాయి. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఇప్పుడు కావాల్సింది 'జన్​కీ బాత్'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్​కీ బాత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రస్తుత పరిస్థితుల్లో జనం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలోని వ్యవస్థ విఫలమైందని ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

లక్కీ కొవిడ్​ రోగి

దేశంలో కొవిడ్​ కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారు కొందరు. వైరస్​ సోకి వైద్యసేవలు అందక ఇబ్బందులు ఎదుర్కొనేవారు మరికొందరు. కానీ.. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం కొవిడ్​ తన జీవితాన్నే మార్చేసిందని చెబుతున్నాడు. ఓ స్వీట్​ సర్ప్రైజ్ ఇచ్చిందని అంటున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మరణంలోనూ ఒక్కటై..

పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఒకరికి ఒకరు తోడుగా జీవిస్తున్నారు. ఏళ్లు గడిచాయి. ఇప్పుడు భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఈ వేదనను తట్టుకోలేక భార్య మృతదేహం పక్కనే భర్త కూడా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉల్లంఘిస్తే గుంజీలు తీయాల్సిందే..

కరోనా నిబంధనలు ఉల్లంఘించిన యువతకు మధ్యప్రదేశ్​ పోలీసులు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. మంద్​సౌర్‌లో కొందరు యువకులు రాత్రి సమయంలో రోడ్లపైకి వచ్చారు. కర్ఫ్యూ అమల్లో ఉండటంతో పోలీసులు వారితో గుంజీలు తీయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరోనా పరిణామాలే కీలకం!

స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత రోజురోజుకూ తీవ్రమవుతుండటం సహా.. విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ వంటివి ఇందుకు కారణం కావచ్చంటున్నారు. 2020-21 క్యూ4 ఫలితాలు, అమెరికా ఫెడ్ నిర్ణయాలు ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపే ప్రధానాంశాలుగా చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సూపర్​ కూల్​ ఫీచర్స్​

యాపిల్‌ యూజర్లకు.. ఒక కొత్త ఫీచర్‌ రావాలంటే చాలా సమయమే పడుతోంది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అలాకాదు... రోజుకో కొత్త ఫీచర్‌తో గూగుల్‌ ఆకర్షిస్తోంది. ఆ క్రమంలోనే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌-12 విడుదలకు సిద్ధమైంది. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 11పై ఇప్పుడిప్పుడే అందరు మనసుపారేసుకుంటుంటే... అప్పుడే వెర్షన్‌12 ఫీచర్లు ఇవేనంటూ వార్తలు చక్కర్లుకొడుతున్నారు. ఇప్పటికే విడుదలైన 3 బీటా వెర్షన్ల ఆధారంగా... ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న ఆ ఫీచర్లేంటో మీరు చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ప్రతి ఒక్కరు కెప్టెన్​లా వ్యవహరించాలి'

కరోనా సంక్షోభం వేళ ప్రతి ఒక్కరూ నాయకుడిలా వ్యవహరించి, చుట్టూ ఉన్నవాళ్లకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు ఆర్​సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. వైరస్​ ఉద్ధృతంగా మారుతోన్న నేపథ్యంలో కోహ్లీతో పాటు జట్టు సహచరులు ఈ మేరకు ట్విట్టర్​లో ప్రజలకు విన్నవించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'సర్దార్'గా కార్తి

కార్తి-మిత్రన్ కాంబినేషన్​లో రూపొందుతున్న సినిమాకు 'సర్దార్' టైటిల్ నిర్ణయించారు. అలానే మోషన్​ పోస్టర్​ను కూడా విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details