2 నెలలు ఉచితంగా రేషన్!
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో గతేడాది మాదిరిగానే పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు అందించాలని నిర్ణయించింది కేంద్రం. పీఎండీకేఓవైలో భాగంగా మే, జూన్ నెలల్లో ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున అందించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'రైల్వే, వాయుసేన సాయంతో..'
కొవిడ్ ఉద్ధృతి కారణంగా మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడిన రాష్ట్రాలకు రైల్వే, వైమానిక దళం ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అత్యవసర ఔషధాలు, ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మేవారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'నిర్లక్ష్యం చేయొద్దు'
కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానం వస్తే నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి ఈటల సూచించారు. వైద్యులు సైతం ఫలితాలు కోసం ఆగొద్దని.. చికిత్స ప్రారంభించాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సచివాలయంలో ఆంక్షలు
కొవిడ్ నేపథ్యంలో సచివాలయంలో పలు ఆంక్షలు విధించారు. సందర్శకులకు ఇచ్చే తాత్కాలిక పాసులను రద్దు చేశారు. సందర్శకుల అనుమతి నిషేధించారు. కరోనా నిబంధనలు విధిగా పాటించాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'సుప్రీంకు జస్టిస్ బోబ్డే వీడ్కోలు'
ఎంతో సంతృప్తి, సంతోషంతో పాటు ఎన్నో జ్ఞాపకాలతో సుప్రీం కోర్టును వీడుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ ఎన్వీ రమణ.. తన విధులను సమర్థంగా నిర్వహిస్తారన్న నమ్మకం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.