తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @3PM

By

Published : Apr 23, 2021, 3:00 PM IST

హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

కరోనా నియంత్రణలో సర్కారు తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రెండో దశ వ్యాప్తి చెందిన తర్వాత మేల్కొంటున్నారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎప్పుడు పెంచుతారని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నో లాక్​డౌన్​

భాజపా అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో లాక్​డౌన్ విధించే ఆలోచన లేదన్న మంత్రి.. కేసులు విపరీతంగా పెరిగితే చెప్పలేమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వర్షసూచన

రాగల మూడ్రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'కోతలను బట్టి కొనుగోళ్లు'

అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రాలు సందర్శించి.. తరచూ పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. వరి కోతలను బట్టి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఖర్చు@రూ.67,193 కోట్లు!

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ మానవాళికి ముప్పుగా తయారైంది. ఈ నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి టీకా వేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారందరికి టీకా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి రూ.67,193 కోట్లు ఖర్చు అవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరోనా నిధులన్నీ కార్పొరేట్లకే!

అభివృద్ధి చెందుతున్న దేశాలలో కరోనా ఉపశమన నిధులు ఎక్కువగా కార్పొరేట్లకే వెళుతున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. అందులో భారత్ కూడా ఉందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బైడెన్​కు సెనేటర్ల వినతి

రెండో దశ విజృంభణతో భారత్​లో కరోనా కేసుల పెరుగుదలపై అమెరికా చట్టసభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. భారత్​కు టీకాలు సహా వైద్య సహకారం అందించాలని బైడెన్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రిలయన్స్ చేతికి స్టోక్‌ పార్క్​!

దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్​.. వ్యాపార విస్తరణను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బ్రిటన్​కు చెందిన స్టోక్​ పార్క్ కంపెనీని కొనుగోలు చేసింది. ఈ సంస్థ హోటల్​తో గోల్ఫ్​ కోర్స్​ను నిర్వహిస్తుంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రికార్డుల వేటగాడు

విరాట్‌ కోహ్లీ.. సమకాలీన క్రికెట్‌లో మేటి ఆటగాడు. ఫార్మాట్‌ ఏదైనా తన ముద్ర చూపిస్తూ దూసుకుపోయే పరుగుల వేటగాడు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా తనదైన శైలిలో జట్టును నడిపిస్తూ మెప్పిస్తున్నాడు. ఈ ఏడాది ట్రోఫీ నెగ్గాలన్న కసితో పరుగుల దాహం పెంచుకుని 6000 పరుగుల మైలురాయి దాటాడు ఈ ఛేదన రారాజు. ఈ రికార్డు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సెలబ్రిటీల ట్రిప్స్​​పై ట్రోలింగ్

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు సరదాగా గడపటానికి వేరే దేశాలకు వెళ్ళడం సరికాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వారిని విపరీతంగా ట్రోల్​ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ కుటుంబం అమెరికాకు వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. అయితే సెలబ్రిటీల వెకేషన్​ ట్రిప్స్​పై మాట్లాడిన హీరోయిన్​ శ్రుతిహాసన్​.. ప్రముఖులు విహారయాత్రలకు వెళ్లడానికి ఇది సరైన సమయం కాదని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details