ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుబంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు.. Weather Report: నైరుతి రుతుపవనాలు ఈ రోజు దక్షిణ బంగాళా ఖాతం, అండమాన్ సముద్రం,అండమాన్ నికోబార్ దీవులలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాగల రెండు రోజులు ఉరుములు మెరుపులతో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.నేడో, రేపో రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన..రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై తెరాస కసరత్తు తుదిదశకు చేరుకుంది. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడో, రేపో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఒకేసారి ముగ్గురు అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా తొలుత ఒకరి పేరునే ఖరారు చేస్తారా అనే ఉత్కంఠ పార్టీవర్గాల్లో కనిపిస్తోంది. సీనియర్లకు దక్కుతుందా.. ఇతర పార్టీలనుంచి వచ్చిన వారికి అవకాశం లభిస్తుందా.. అండగా ఉంటున్న పారిశ్రామికవేత్తలను వరిస్తుందా.. అనే చర్చ గులాబీశ్రేణుల్లో జోరుగా సాగుతోంది.నేటి నుంచి కేటీఆర్ విదేశీ పర్యటన.. KTR Foreign Tour: తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధన లక్ష్యంతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పది రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈనెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొననున్నారు.ఈ నెల 20 వరకే గడువు..Police Recruitment: పోలీసు నియామక మండలి భర్తీ చేయనున్న కొలువులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అన్ని ఉద్యోగాలకు ఇప్పటివరకు 5లక్షలకు పైగా దరఖాస్తులు రాగా.. మరో 2లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అక్రమాలకు తావులేకుండా దరఖాస్తు ప్రక్రియ నుంచి తుదిపరీక్ష వరకు అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు.రాష్ట్రం కూతవేటు దూరంలో ఉంది.. Pawan tweet on cm jagan: వైకాపా ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో ఉందని.. మీరు చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని దూరం చేసే ప్రయత్నం చేయండి అని పవన్ ట్వీట్ చేశారు.లోక్‌పాల్ కొత్త చీఫ్ నియామకంపై కేంద్రం దృష్టి..Lokpal: భారత లోక్‌పాల్ చీఫ్ నియామకంపా కేంద్రం దృష్టిసారించింది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తును మొదలుపెట్టింది.2 లక్షల మందిపై వరద ప్రభావం.. Assam Floods: అసోంను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా ఇప్పటికే సుమారు 2లక్షల మంది నిరాశ్రయులైనట్లు అసోం ప్రభుత్వం ప్రకటించింది. కొండచరియలు విరిగిపడి రహదారులు దెబ్బతిన్నాయి.షాంఘైలో లాక్డౌన్ ఎత్తివేత!Shanghai Lockdown: చైనాలోని షాంఘై నగరం లాక్డౌన్ నుంచి బయటపడనుంది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం వల్ల జూన్ 1 నుంచి పూర్తిస్థాయిలో ఆంక్షలను ఎత్తివేయనున్నారు.దిల్లీ ప్లేఆఫ్ ఆశలు సజీవం.. IPL 2022: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను 142 పరుగులకే కట్టడి చేసింది.'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ లోగో..ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు ఏడిద శ్రీజ.. 'శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్' పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఇప్పుడీ బ్యానర్‌లో ఆమె నిర్మిస్తున్న తొలి చిత్రం 'ఫస్ట్ డే ఫస్ట్ షో' లోగోను ఆవిష్కరించారు. అలాగే తాప్సీ నిర్మాతగా మారిన సినిమా అప్డేట్ మీకోసం..