ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుఈనెల 15న దేశంలోకి నైరుతి రుతుపవనాలు! Southwest monsoon: భానుడి భగభగలకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు గుడ్‌న్యూస్. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతు పవనాలు రానున్నాయి. ఈనెల 15న భారత్‌ను నైరుతి పవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.తల్లిని చంపిన కుమారుడి కేసులో మరో మలుపుకడుపున పుట్టకున్నా కన్న పేగును మించిన ప్రేమతో చూసుకున్న తల్లి పాలిట కాలయముడిగా మారాడు. ఎంతో సంబరంతో పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్న ఆ మాతృమూర్తిని కనికరం లేకుండా అంతమొందించాడు.. ఓ దత్తత పుత్రుడు. కానీ, తల్లిని చంపిన పాపం ఎక్కువ కాలం నిల్వలేదు. అమ్మను హతమార్చి పారిపోయిన ఆ కసాయిని మృత్యువు ఎంత దూరం వదల్లేదు. చేసిన దారుణమో వెంటేసుకెళ్లిన పాపమో.. ఆ కర్కోటకుడు కిరాతకంగా హత్యకు గురయ్యాడు.'హ్యాకర్ కోసం వేట... బ్లూ కార్నర్ నోటీసులు సిద్ధం' Mahesh Bank Hacking Case: మహేశ్ బ్యాంక్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్యాంక్ సర్వర్లోకి చొరబడిన హ్యాకర్‌ను గుర్తించడానికి బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారు. ఈ కేసులో ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటున్న సైబర్ క్రైం పోలీసులు నిందితుడిని పట్టుకునే వేటలో పడ్డారు.'తెలంగాణ కంటే గోవాలోనే ఎక్కువ పథకాలు'Goa CM Telangana Tour: డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు మించి అభివృద్ధి, సంక్షేమం జరుగుతోందని.. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. గోవా అన్ని రంగాల్లోనూ తెలంగాణ కంటే మెరుగ్గా దూసుకెళ్తోందన్న సావంత్.. ప్రభుత్వ సాయం ప్రతి ఇంటికి చేరేలా పనిచేస్తున్నామన్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నేతల మధ్య వార్ Karnataka Congress Ramya tweet: మండ్య మాజీ ఎంపీ రమ్య.. ట్విట్టర్ వేదికగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిపై విమర్శలు ఎక్కుపెట్టారు. తనపై ట్రోల్స్ చేయాలని కార్యకర్తలకు శివకుమార్ సూచించారని ఆరోపించారు. ఈ మేరకు పలు స్క్రీన్షాట్లను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.పెళ్లికి ఒప్పుకోలేదని గర్ల్‌ఫ్రెండ్ దారుణ హత్యMan murders girlfriend: హత్యకేసులో బెయిల్‌పై విడుదలైన ఓ వ్యక్తి.. తనతో పెళ్లికి ఒప్పుకోలేదని యువతిని హత్య చేశాడు. ఈ ఘటన పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లా సైన్‌పుర్ గ్రామంలో జరిగింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.ఉగ్రవాదుల కిరాతకం జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్ అయిన ప్రభుత్వ ఉద్యోగిని దారుణంగా కాల్చి చంపారు.దడ పుట్టిస్తున్న ధరలు.. 8ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం!Inflation rate in India 2022: దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. మార్చిలో 6.95 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో 7.79 శాతానికి పెరిగింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి కావడం ఆందోళనకరం.ఉబెర్ కప్ నుంచి సింధు టీం ఔట్.. Uber Cup 2022: ఉబెర్ కప్ నుంచి భారత జట్టు నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు సారథ్యంలోని మహిళల జట్టు థాయ్‌లాండ్ చేతిలో పరాజయం చవిచూసింది.ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్..టాలీవుడ్ టాప్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. 'ఆర్ఆర్ఆర్' సినిమా సక్సెస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు తారక్. భారీ బడ్జెట్‌తో తీసే.. ఎన్టీఆర్ సినిమాలు ఎంత రిచ్‌గా ఉంటాయో.. ఆయన పర్సనల్ లైఫ్ అంతకు మించి లగ్జరీగా ఉంటుంది. మూవీకి దాదాపు రూ. 45కోట్లు తీసుకునే తారక్ వద్ద ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. కార్ల కలెక్షన్, పర్సనల్ జెట్, రూ.కోట్లు విలువ చేసే వాచ్.. ఇలా ఆయన వద్ద ఉన్న.. కొన్ని ఖరీదైన వస్తువుల వివరాలు మీకోసం..