తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - headlines today

ETV BHARAT LATEST TOP NEWS
ETV BHARAT LATEST TOP NEWS

By

Published : Nov 20, 2021, 6:26 AM IST

Updated : Nov 20, 2021, 10:00 PM IST

21:55 November 20

టాప్​ న్యూస్​​@10pm

  •  వారికి రూ.3 లక్షల ఆర్థికసాయం

సాగు చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులకు సీఎం కేసీఆర్​ అభినందనలు (CM KCR on Three Farmers Law ) తెలిపారు. ఉత్తరాది రైతులు అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు.

  • దేశంలోనే తొలిసారి.. !

వివిధ నేరవిభాగాల్లో ఉపయోగపడే 'ఫోరెన్సిక్ డీఎన్​ఏ ప్రొఫైల్ సెర్చ్​ టూల్​'ను తమిళనాడు ప్రభుత్వం తీసుకువచ్చింది. సీఎం ఎమ్​కే స్టాలిన్​ దీనిని ప్రారంభించారు. దేశంలో ఈ సాంకేతికతను వాడుతున్న మొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.

  •  ఒక్కపూట ధర్నాకే మోదీ భయపడ్డారా?: 

రైతుల పోరాటాలతోనే కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy on farmers law) అన్నారు. రైతుల విజయాన్ని కేసీఆర్ తన ఖాతాలో వేసుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఈ పోరాటంలో అమరులైన రైతులకు నివాళిగా కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

  •  ప్రాణాలకు ముప్పు

దిల్లీలో వాయు కాలుష్యానికి(Delhi air pollution) పంజాబ్‌, హరియాణాతోపాటు పాకిస్థాన్‌ నుంచి వెలువడుతున్న పొగ కారణమని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) అంచనా వేసింది.

  • వచ్చే ఐపీఎల్​లో ధోనీ ఏమన్నాడంటే?

వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్​లో ఆడే విషయంపై స్పష్టతనిచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంస్ ధోనీ(ms dhoni ipl retirement). చెన్నైలోనే తన చివరి టీ20 మ్యాచ్ ఆడతానని మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

20:48 November 20

టాప్​ న్యూస్​​@9pm

  • రేపు దిల్లీకి సీఎం 

వరిధాన్యం కొనుగోలు గురించి కేంద్రాన్ని ఎన్నోసార్లు అడిగినట్లు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఏడాదిలో ఎంత కొంటారో కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అందరం దిల్లీకి వెళ్లి ప్రధాని, ఎఫ్‌సీఐని అడగాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.  

  •  వారికి రూ.3 లక్షల ఆర్థికసాయం

సాగు చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులకు సీఎం కేసీఆర్​ అభినందనలు (CM KCR on Three Farmers Law ) తెలిపారు. ఉత్తరాది రైతులు అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు.

  •  'మా జోలికొస్తే ఖబడ్దార్'

తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేతల వ్యాఖ్యలపై నందమూరి కుటుంబసభ్యులు స్పందించారు. తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమన్న బాలకృష్ణ.. అసెంబ్లీలో ఉన్నామో, పశువుల కొంపలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  •  అక్కడక్కడా ఉద్రిక్తత!

రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం లాటరీ(telangana liquor tender 2021) నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఎంపిక చేస్తున్నారు. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఖమ్మంలో టెండర్లు రద్దు చేయాలంటూ వామపక్ష మహిళా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.

  • జలదిగ్బంధంలో తిరుపతి.. 

తిరుపతిలో(Tirupati rain news) ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇళ్లల్లో వరద ప్రవాహంతో ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

19:55 November 20

టాప్​ న్యూస్​​@ 8pm

  •  వారికి రూ.3 లక్షల ఆర్థికసాయం

సాగు చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులకు సీఎం కేసీఆర్​ అభినందనలు (CM KCR on Three Farmers Law ) తెలిపారు. ఉత్తరాది రైతులు అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు.

  •  మంత్రుల రాజీనామా

రాజస్థాన్ కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు(rajasthan cabinet news). ఆదివారం కేబినెట్ పునర్​వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో సీఎం అశోక్​ గహ్లోత్ నివాసంలో భేటీ అయిన మంత్రులు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరి రాజీనామాను గహ్లోత్ ఆమోదించారు. మరికొద్ది సేపట్లో గవర్నర్​ను గహ్లోత్​ కలవనున్నారు. రాజీనామాలను సమర్పించనున్నారు.

  • భారీ నిరసనలకు రైతు సంఘాల పిలుపు

రైతుల డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసనలు చేపడతామని సంయుక్త కిసాన్​ మోర్చా (ఎస్​కేఎమ్)​ తెలిపింది. ఈ నెల 26న దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఆందోళనల్లో(farmer protest) రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది.

  • మరింత విషమంగా కైకాల ఆరోగ్య పరిస్థితి

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్లు వైద్యులు తెలిపారు(kaikala satyanarayana health condition). ఆయన చికిత్సకు స్పందించట్లేదని అన్నారు.

  • ' బ్యాకప్ ఓపెనర్ ఎవరు?'

టీమ్ఇండియా బ్యాకప్ ఓపెనర్​పై దృష్టిసారించాలని సూచించాడు సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్(dinesh karthik news). రోహిత్, రాహుల్(kl rahul news) గాయపడితే వారి స్థానంలో ఎవరు ఆడతారనే సందేహం అందరిలోనూ ఉందన్నాడు.

18:52 November 20

టాప్​ న్యూస్​​@ 7pm

  • పార్కింగ్‌ ఫీజుకు అనుమతి

పార్కింగ్‌ ఫీజు వసూలు చేసేందుకు థియేటర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మల్టీఫ్లెక్స్‌ థియేటర్లలో యథాతథంగా ఉచిత పార్కింగ్‌ ఉంటుందని తెలిపింది. 

  • 'చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేకపోయా'

తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నాగబాబు (Nagababu react on Chandrababu incident) స్పందించాారు. వ్యక్తిగత దూషణలు సరికాదన్న ఆయన.. రాజకీయాలు మరింత దిగజారాయని అభిప్రాయపడ్డారు.

  •  బాలిక బలవన్మరణం

లైంగిక వేధింపులకు గురైన ఓ బాలిక.. బలవన్మరణానికి(Girl Suicide) పాల్పడింది. చనిపోయే ముందు రాసిన లేఖలో తనపై జరిగిన ఘోరం గురించి బయటపెట్టింది. తమిళనాడులో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.

  • ఆయన మృతిపై సీబీఐ ఛార్జిషీటు

మహంత్​ నరేంద్ర గిరి (Narendra Giri death) మృతి కేసులో ఆయన శిష్యుడు ఆనంద్ గిరి సహా మరో ఇద్దరిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. మహంత్ ఆత్మహత్యకు పాల్పడేలా వారు ప్రేరేపించారని పేర్కొంది.

  • భారీ అగ్ని ప్రమాదం

త్రిపురలో భారీ అగ్ని (Fire accident latest news) ప్రమాదం జరిగింది. 18 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు వ్యాప్తి చెందకుండా మరో 11 గుడిసెలను ధ్వంసం చేశారు.

17:52 November 20

టాప్​ న్యూస్​​@ 6pm

  • రైల్వే ట్రాక్‌పై బాంబు దాడులు

ఝార్ఖండ్​లోని రైల్వేట్రాక్​లపై వరుస బాంబుదాడులకు(Maoists attack in Jharkhand) పాల్పడ్డారు దుండగులు. ధన్​బాద్​, లాతెహార్​, పశ్చిమ సింహబూమ్​ జిల్లాల్లో ట్రాక్​లను పేల్చివేశారు. మావోయిస్టులే ఈ దాడులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

  • 'వారికి చావుదెబ్బ తప్పదు'

సరిహద్దులో దురాక్రమణలకు పాల్పడితే చావుదెబ్బ కొడతామని పొరుగు దేశాలకు హెచ్చరికలు చేశారు రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్(rajnath singh news)​. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌ జిల్లాలో.. అమరులైన 232 మంది జవాన్ల సంస్మరణార్థం చేపట్టిన షహీద్‌ సమ్మాన్‌ యాత్రలో పాల్గొన్నారు(uttarakhand sainik uatra).

  • 'ఆ నిజాన్ని అంగీకరించాలి'

భారత్​-చైనా సరిహద్దు వివాదాన్ని ఉద్దేశిస్తూ మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. చైనా ఆక్రమణలకు పాల్పడిందనే నిజాన్ని ఒప్పుకోవాలని ట్విట్టర్​ వేదికగా డిమాండ్​ చేశారు.

  • 'పుష్ప' అప్డేట్​..!

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి(cinema updates telugu). ఇందులో అల్లుఅర్జున్​ 'పుష్ప', నవీన్​చంద్ర 'బ్రో', సంపూర్ణేశ్​బాబు 'క్యాలిఫ్లవర్'​ ట్రైలర్స్​​ ఉన్నాయి. ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ ప్రచార చిత్రాలను మీరూ చూసేయండి..

  •  హైదరాబాద్​కు నిరాశ

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఫైనలిస్టులు ఎవరో తెలిసిపోయింది. తమిళనాడు, కర్ణాటక మరోసారి తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. నేడు (నవంబర్ 20) జరిగిన సెమీస్ మ్యాచ్​ల్లో హైదరాబాద్​పై తమిళనాడు, విదర్భపై కర్ణాటక విజయం సాధించాయి.

16:57 November 20

టాప్​ న్యూస్​​@ 5pm

  • అరాచక పాలనకు నాంది

తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు(junior ntr react on ycp leaders). శుక్రవారం అసెంబ్లీలో జరిగిన ఘటన.. తన మనసును కలిచివేసిందన్నారు.  రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే కానీ.. అవి ప్రజా సమస్యలపై జరగాలని వ్యాఖ్యానించారు.

  • మంత్రులతో కేసీఆర్ భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR meeting today).. మంత్రులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. అభ్యర్థులను కూడా నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉంది.

  • నాడు భర్త .. నేడు  భార్య

తమిళనాడు చెన్నైలోని ఆఫీసర్స్​ ట్రైనింగ్​ అకాడమీ నుంచి మొత్తం 178 మంది క్యాడెట్లు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో గతంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓ జవాను భార్య కూడా ఉన్నారు. భర్త చివరి కోరికను ఆమె నిజం చేశారు. కాగా ఏడుగురు అఫ్గాన్​ క్యాడెట్లు ఈ శిక్షణలో ఉత్తీర్ణత సాధించారు.

  •  ఆర్యన్​ ఖాన్​కు ఊరట.. 

డ్రగ్స్​ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్​ ఖాన్​కు (Aryan Khan) బాంబే హైకోర్టులో మరోసారి ఉపశమనం లభించింది. డ్రగ్స్‌ సంబంధిత నేరాల కుట్రకు సంబంధించి అతడికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది.

  •  సింధు ఓటమి

ఇండోనేషియా మాస్టర్స్ (Indonesia Masters 2021)​ సూపర్​ 750లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV sindhu news)కథ ముగిసింది. సెమీఫైనల్లో యమగూచి చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది.

16:05 November 20

టాప్​ న్యూస్​​@ 4pm

అరాచక పాలనకు నాంది: జూ. ఎన్టీఆర్ 

వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో సరికాదన్నారు జూనియర్ ఎన్టీఆర్‌. ఆడపడుచులపై పరుష వ్యాఖ్యలు.. అరాచక పాలనకు నాంది అని ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతల వ్యాఖ్యలపై స్పందించారు.

 

మంత్రులతో కేసీఆర్ భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR meeting today).. మంత్రులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. అభ్యర్థులను కూడా నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉంది.

యువతులపైకి దూసుకెళ్లిన ఆటో..

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు యువతులపై అతివేగంగా ఓ ఆటో దూసుకొచ్చింది. కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని సాగర పట్టణంలో ఈ ఘటన వెలుగుచూసింది. యువతులిద్దరూ కంప్యూటర్ క్లాస్‌ నుంచి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 

కొవిడ్ నిబంధనలు వద్దని ధర్నా

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ఆస్ట్రేలియా వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజారోగ్య నిర్వహణలో ఆరోగ్యమంత్రికి విస్తృత అధికారాలను కట్టబెట్టడం, ఓ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించే అధికారం ప్రధానమంత్రికి ఇవ్వడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. దీనిని వ్యతిరేకిస్తూ మెల్​బోర్న్​ నగరంలో జనం భారీగా రోడ్లపైకి తరలివచ్చారు.

బుల్లితెరపై మహేశ్‌-ఎన్టీఆర్..

బుల్లితెరపై సూపర్​స్టార్​ మహేశ్ బాబు సందడి చేయనున్నారు. యంగ్​ టైగర్ ఎన్టీఆర్​ వ్యాఖ్యాతగా అలరిస్తోన్న రియాల్టీ గేమ్​ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'లో పాల్గొన్నారు మహేశ్. 

14:34 November 20

టాప్​ న్యూస్​​@ 3pm

  •  మా జోలికొస్తే ఖబడ్దార్

తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేతల వ్యాఖ్యలపై నందమూరి కుటుంబసభ్యులు స్పందించారు. తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమన్న బాలకృష్ణ.. అసెంబ్లీలో ఉన్నామో, పశువుల కొంపలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడి పెట్టుకోవటం తాము ఎప్పుడూ చూడలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. 

  •  'పాత నేరస్థుడే దాడి చేశాడు'

కేబీఆర్ పార్కులో నటి షాలూ చౌరాసియాపై దాడి కేసులో(Shalu chourasiya case) పురోగతి లభించింది. నిందితుడు బాబు గదిలో చౌరాసియా ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. కేబీఆర్ పార్క్‌లో మరింత భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు.

  •  9 మంది అరెస్ట్​​

దేశంలో కొన్నాళ్లుగా అక్రమంగా నివసిస్తున్న తొమ్మిది మంది వలసదారులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను బంగ్లాదేశీయులుగా(Bangladesh immigrants in India) గుర్తించిన అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

  • సీనియర్ నటుడికి తీవ్ర అస్వస్థత

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది(kaikala satyanarayana news). అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకోవాలని అభిమానులు, సినీప్రముఖులు కోరుకుంటున్నారు(kaikala satyanarayana health).

  • 'నాపై అతని​ ప్రభావం చాలా ఉంది"

భారత్​ తరఫున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్​లోనే అదరగొట్టాడు యువ పేసర్ హర్షల్ పటేల్(harshal patel news). ప్రముఖ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ తన కెరీర్​పై చాలా ప్రభావం చూపాడని పేర్కొన్నాడు.

13:46 November 20

టాప్​ న్యూస్​​@ 2pm

  • కాసేపట్లో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులతో కాసేపట్లో సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నారు. అభ్యర్థులను కూడా నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉంది.

  • నందమూరి కుటుంబం జోలికొస్తే ఖబడ్దార్

తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేతల వ్యాఖ్యలపై నందమూరి కుటుంబసభ్యులు స్పందించారు. తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమన్న బాలకృష్ణ.. అసెంబ్లీలో ఉన్నామో, పశువుల కొంపలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడి పెట్టుకోవటం తాము ఎప్పుడూ చూడలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. 

  • మా సహనాన్ని పరీక్షించొద్దు

ఏపీ అసెంబ్లీ(AP assembly news 2021)లో జరిగిన పరిణామాలపై నందమూరి రామకృష్ణ(nandamuri ramakrishna news) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబం జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టమని హెచ్చరించారు. వ్యక్తిగత విషయాల జోలికి రావద్దని సూచించారు.

  • అప్పుడే.. రైతు ఉద్యమం ఆగేది..

కనీస మద్దతు ధరపై(MSP) కేంద్రం హామీ ఇచ్చేంతవరకు రైతులు ఉద్యమం ఆపబోరని చెప్పారు భాజపా ఎంపీ వరుణ్ గాంధీ(varun gandhi news). దీనిపై ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు(varun gandhi news today).

  • కేబీఆర్ పార్క్‌ వీఐపీ జోన్​లో మరిన్ని భద్రత చర్యలు

13:05 November 20

టాప్​ న్యూస్​​@ 1pm

  • 'విర్రవీగి మాట్లాడేవాళ్లు ఇక నోరు అదుపులో పెట్టుకోవాలి'

తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేతల వ్యాఖ్యలపై నందమూరి కుటుంబసభ్యులు స్పందించారు. తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమన్న బాలకృష్ణ.. అసెంబ్లీలో ఉన్నామో, పశువుల కొంపలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడి పెట్టుకోవటం తాము ఎప్పుడూ చూడలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు.  ప్రజాసమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో అభివృద్ధిపై బదులు.. వ్యక్తిగత అజెండా తీసుకువచ్చారని మండిపడ్డారు. 

  • వరుసగా ఐదోసారి క్లీనెస్ట్​ సిటీగా 'ఇండోర్​'

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా(cleanest city in india ) మళ్లీ మధ్యప్రదేశ్​లోని ఇండోర్​ నగరమే(Indore cleanest city) నిలిచింది. స్వచ్ఛత సర్వేలో(swachh survekshan 2021) వరుసగా ఐదోసారి ఈ ఘనత సాధించింది. ఆ తర్వాతి స్థానంలో సూరత్​ నిలిచింది.

  • వరకట్న వేధింపులతో నవవధువు బలవన్మరణం

వరకట్న వేధింపులకు ఓ వివాహిత విషగుళికలు తిని ప్రాణాలు తీసుకుంది(dowry death). వివాహమై ఏడాది కూడా గడవకముందే ఆత్మహత్య చేసుకుంది(chhatarpur dowry death). ఈ సంఘటన మధ్యప్రదేశ్​, ఛతర్​పుర్​ జిల్లాలో జరిగింది.

  • ముష్ఫికర్​కు షోకాజ్​ నోటీసులు

బంగ్లాదేశ్​ క్రికెట్ బోర్డు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు ఆ దేశ జట్టు క్రికెటర్ ముష్ఫికర్​ రహీమ్(mushfiqur rahim news)​. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సెలక్షన్ ప్యానెల్ అతడికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

  • డయానా.. బయోపిక్‌ల రారాణి!

ప్రపంచంలో అత్యధిక బయోపిక్‌లు వచ్చింది ఎవరిపైనో తెలుసా? అతిలోక సుందరి ప్రిన్సెస్ డయానాపైనే (Princess Diana Biopic). కెరీర్​లో ఒక్కసారైనా ఆమె పాత్రలో నటించాలని హీరోయిన్లు ఉవ్విళ్లూరుతుంటారు. ఇప్పటి వరకు ఆమెపై 11 బయోపిక్​లు వచ్చాయి. వాటి విశేషాలు చూడండి.

11:54 November 20

టాప్​ న్యూస్​​@ 12pm

  • నటిపై దాడి కేసులో పురోగతి

హైదరాబాద్​లోని నటి షాలూ చౌరాసియాపై దాడి కేసులో పురోగతి లభించింది. చౌరాసియాపై దాడి (Attack on Shalu Chourasia) కేసులో నిందితుడిని టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన (Attack on Shalu Chourasiya) వ్యక్తి సినీ పరిశ్రమలో లైట్ బాయ్‌గా పనిచేస్తున్న బాబుగా గుర్తించారు. 

  • మోదీ సర్కార్ 'పట్టువిడుపులు' ఎన్నో!

వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు (Farm Laws repeal) కేంద్రం ప్రకటించింది. గతంలోనూ అనేక బిల్లులు, చట్టాలు, విధాన నిర్ణయాలపై మోదీ సర్కారు (PM Modi news) వెనక్కి తగ్గింది. టీకాల సేకరణ, ఈపీఎఫ్ చట్టం, ఉపాధి హామీ చట్ట సవరణ వంటి అంశాలపై ముందుగా తీసుకున్న నిర్ణయాలను విరమించుకుంది.

  • రుణ యాప్​లలో సగానికి పైగా నకిలీవే

దేశంలోని డిజిటల్ రుణాల యాప్​లలో (Loan app in India) సగానికి పైగా నకిలీవేనని ఆర్​బీఐ వెల్లడించింది. రుణ యాప్​లు (Digital loan app) పెరుగుతున్న కొద్దీ.. నకిలీలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫ్రేమ్​వర్క్ రూపొందించాలని సూచించింది.

  • ముష్ఫికర్​కు షోకాజ్​ నోటీసు

బంగ్లాదేశ్​ క్రికెట్ బోర్డు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు ఆ దేశ జట్టు క్రికెటర్ ముష్ఫికర్​ రహీమ్(mushfiqur rahim news)​. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సెలక్షన్ ప్యానెల్ అతడికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

  • 95 దేశాల నుంచి 624 చిత్రాల ప్రదర్శన

ఇంటర్నేషనల్ ఫిల్మ్​ ఫెస్టివల్ ఆఫ్​ ఇండియా (ఐఎఫ్​ఎఫ్​ఐ) (IFFI Goa 2021) నేటి నుంచి గోవాలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవాల్లో (IFFI) 95 దేశాల నుంచి వచ్చిన 624 చిత్రాలను ప్రదర్శించనున్నారు.

10:55 November 20

టాప్​ న్యూస్​​@ 11AM

  • అమెరికా తరహా ప్రమాదం

రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్​పేట్ రింగురోడ్డు వద్ద అమెరికా తరహా రోడ్డు ప్రమాదం(ORR Accident hyderabad today) చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించుకోవడానికి కారు సడన్​ బ్రేక్ వేయడం వల్ల దాని వెనుక వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 

  • ప్రారంభమైన మహాపాదయాత్ర

ఏపీలో భారీ వర్షాల కారణంగా రెండు రోజులుగా నిలిచిపోయిన రైతుల పాదయాత్ర నేడు తిరిగి ప్రారంభమైంది. ఇవాళ ప్రకాశం జిల్లాలో 18 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. సాయంత్రానికి కావలి మండలం రాజువారి చింతలపల్లి చేరుకోనున్న రైతులు.. రాత్రి అక్కడే బస చేయనున్నారు.

  • తగ్గిన బంగారం ధర

బంగారం ధర(Gold Price today) స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.200 తగ్గింది. పసిడి బాటలో పయనించిన వెండి(Silver price today).. కిలోకు రూ.100 దిగొచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • పరిస్థితులు అనుకూలించకపోయినా..

న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో(IND vs NZ T20) గెలిచి సిరీస్​ను సొంతం చేసుకుంది టీమ్​ఇండియా. ఈ నేపథ్యంలో మాట్లాడిన టీమ్​ఇండియా టీ20 సారథి రోహిత్ శర్మ(Rohit Sharma News).. ప్రతి ఒక్కరూ గొప్పగా రాణించారని కొనియాడాడు. మరోవైపు ఇన్నింగ్స్ ఓపెనింగ్​ చేయడాన్ని ఆస్వాదిస్తామని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

  • ధన్సిక హొయలకు.. గుండె ధక్​ ధక్​

'కబాలి' చిత్రంలో సూపర్​ స్టార్​ రజనీ కాంత్​ కూతురిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది సాయి ధన్సిక. నేడు (నవంబర్ 20) ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె విశేషాలు..

09:55 November 20

టాప్​ న్యూస్​​@ 10AM

  • మరో 10 వేల మందికి కరోనా

దేశంలో కరోనా(Coronavirus India) వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 10,302 మంది వైరస్ బారిన పడినట్లు (Corona cases in India) తేలింది. కొవిడ్​(Coronavirus India)​ ధాటికి మరో 267 మంది మరణించారు. ఒక్కరోజే 11,787 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా 0.36 శాతానికి తగ్గి.. యాక్టివ్​ కేసుల సంఖ్య 531 రోజుల కనిష్ఠానికి చేరింది.

  • రద్దును స్వాగతించిన అమెరికా!

నూతన సాగు చట్టాలను రద్దు (farm laws repealed news) చేస్తామని కేంద్రం ప్రకటించటాన్ని స్వాగతించారు అమెరికా కాంగ్రెస్​ సభ్యుడు. కార్మికులు కలిసికట్టుగా పోరాడితే దేనినైనా ఓడించగలరనేందుకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

  • నా పేరు ఎంత ముద్దుగుందో!

చిన్నతనంలో చదువు విలువ తెలియకనో.. ఆ దిశగా ఎవరూ ప్రోత్సహించకపోవడం వల్లనో.. చదువుకునేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించకో చాలా మంది బాల్యంలోనే విద్యకు దూరం అవుతారు. కొంతమంది నాలుగు, ఐదో తరగతుల్లోనే చదువు మానేస్తారు. అలా విద్య లేకున్నా ఎన్నో కష్టనష్టాలకోర్చి జీవితాన్ని అందంగా ఆనందమయం చేసుకుంటారు. 

  • పోస్టింగుల్లో మీనమేషాలు.. 

గడువు ముగిసినా ఆబ్కారీశాఖలో గ్రూప్‌-2 ఎస్సైలకు రెగ్యులర్‌ పోస్టింగులు ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. కొత్త మద్యం దుకాణాలు తెరిచే దాకా కొందరు ఈ ప్రక్రియ జరగకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. కొత్తగా లైసెన్స్‌ పొందిన వ్యాపారులు దుకాణాలను ప్రారంభించే సమయంలో.. గుడ్‌విల్‌ కింద కొంతమొత్తం సమర్పించుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఉన్నతాధికారులు.. ఎస్సైల భర్తీ జరగకుండా అడ్డుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
 

  • రోహిత్​ శర్మ 'క్రేజీ' అభిమాని

న్యూజిలాండ్​, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్(IND vs NZ t20) సందర్భంగా ఓ అభిమాని భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించాడు. రోహిత్​ శర్మ(rohit sharma fan) దగ్గరకు పరుగెత్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

08:56 November 20

టాప్​ న్యూస్​​@ 9AM

  • పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్‌ కోటా

ప్రభుత్వ వైద్యకళాశాలల్లోని పీజీ వైద్య సీట్ల(medical pg seats in telangana 2021) భర్తీలో మూడేళ్ల కిందట నిలిపివేసిన ఇన్​సర్వీస్ కోటాను సర్కార్ పునరుద్ధరించింది. ఈ ఏడాది ప్రవేశాల నుంచే ఇది అమలు చేయాలని నిర్ణయించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

  • కూలిన రెండు భవనాలు

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కదిరి పాత ఛైర్మన్ వీధిలో రెండు భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద 11 మంది చిక్కుకోగా.. అందులో నలుగురిని అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

  • మర్మాంగాన్ని కోసేసింది..

ఓ మహిళా యోగా టీచర్ తన సహోద్యోగితో దారుణంగా ప్రవర్తించింది. తోటి యోగా గురువు ప్రైవేటు భాగాలను కోసేసింది. అనంతరం కనిపించకుండా పోయిన మహిళ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

  • ఆచూకీపై ఉద్యమం ఉద్ధృతం

చైనా స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి(Peng Shuai Missing) కనిపించకపోవడంపై అటు అభిమానులు, ఇటు తోటి క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంగ్‌ షువాయి ఎక్కడంటూ ప్రపంచం మొత్తం ప్రశ్నిస్తున్నా చైనా మాత్రం పెదవి విప్పడం లేదు.

  • కృష్ణ చేతుల మీదుగా.. ఫస్ట్​ లుక్

దర్శకుడిగా, నిర్మాతగా తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన 'విఠలాచార్య' శత జయంతి ఉత్సవాలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన జీవితంపై రాసిన 'జై విఠలాచార్య' అనే పుస్తకాన్ని తీసుకురానున్నారు. దీనికి సంబంధించి ఫస్ట్​లుక్​ను సూపర్​స్టార్ కృష్ణ విడుదల చేశారు.

08:01 November 20

టాప్​ న్యూస్​​@ 8AM

  • రాజస్థాన్​లో భూకంపం

భూకంపం ధాటికి రాజస్థాన్​ జాలౌర్ (Earthquake in Rajasthan)​ ప్రజలు ఉలిక్కిపడ్డారు. శనివారం అర్ధరాత్రి 2.26 గంటల సమయంలో.. భూమి కంపించింది. రిక్టర్​ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైంది.

  • ఆ రైతులది 45 ఏళ్ల పోరాటం!

ఏడాదిపాటు అలుపెరగక పోరాడి... వ్యవసాయ చట్టాలపై విజయం సాధించింది నేటి రైతాంగం! అయితే భారత చరిత్రలో ఇంతకంటే సుదీర్ఘంగా సాగిన రైతు ఉద్యమం (Rajasthan Bijoliya kisan andolan) ఒకటుంది. బ్రిటిష్‌ హయాంలో... రాజస్థాన్‌లో ఆ సమరం (Bijoliya kisan andolan) దాదాపు 45 ఏళ్లపాటు సాగింది.

  • విద్యార్థులకు ఉపకారవేతనాలు దూరం

విద్యార్థులకు కాస్త ఆర్థిక భరోసా ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ ఉపకార వేతనాలు(scholarships for telangana students), బోధన రుసుం(tuition fees)లను అందిస్తోంది. ఉపకార వేతనం పొందాలంటే.. ప్రవేశాలు పూర్తయ్యేనాటికి కళాశాలలు ఈ-పాస్​(ts epass registration)లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. 

  • రోహిత్-రాహుల్ అరుదైన ఫీట్

టీ20ల్లో వరుసగా ఐదు అర్ధశతక భాగస్వామ్యాలు నమోదు చేసిన భారత ఓపెనింగ్​ జోడీగా రోహిత్‌-రాహుల్‌(rohit rahul partnership) రికార్డు సృష్టించారు. న్యూజిలాండ్​తో సిరీస్​లో భాగంగా జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో(IND vs NZ T20) ఈ ఘనత సాధించారు.

  • క్రిస్మస్​ బరిలో బడా సినిమాలు

గతేడాది క్రిస్మస్​ సందర్భంగా కొత్త సినిమాల సందడి లేనేలేదు. అయితే ప్రస్తుతమున్న అనుకూల పరిస్థితుల నేపథ్యంలో భారీ చిత్రాలు ఆకట్టుకోనున్నాయి. వీటిలో.. రణ్​వీర్​ సింగ్ నటించిన '83'తో పాటు.. వరుణ్ తేజ్ 'గని', నాని ద్విపాత్రాభినయం చేస్తున్న 'శ్యామ్ సింగరాయ్' వంటి చిత్రాలున్నాయి.

06:50 November 20

టాప్​ న్యూస్​​@ 7AM

  • నేడు ఇంజినీరింగ్ కౌన్సిలింగ్

ఇవాళ్టి నుంచి ఇంజినీరింగ్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేడు, రేపు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించనున్నారు. మరోవైపు పీజీ ఈసెట్ తుది విడత ప్రవేశాల ప్రక్రియ కూడా నేటి నుంచే ప్రారంభం కానుంది.

  • ఒడుదొడుకుల మధ్యే జీవితాలు

చేపల ఉత్పత్తిలో భారత్‌ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే కొన్ని తరాలుగా చేపల వేటతోనే జీవితం సాగిస్తున్న సంప్రదాయ మత్స్యకార కుటుంబాలు కష్టాలకు ఎదురీదుతున్నాయి. కాలానుగుణంగా మార్పును స్వీకరించకపోవడం, ఆధునిక వేట పద్ధతులను అందిపుచ్చుకోలేకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, దళారుల దందా, ప్రభుత్వ పథకాల లబ్ధిని అందుకోవడంలో ఇబ్బందులు వెరసి మత్స్యకారుల జీవితాలు ఒడుదొడుకుల మధ్యే సాగుతున్నాయి.

  • అఫ్గాన్‌పై పాక్‌ కుటిల వ్యూహం

అఫ్గాన్‌ పరిస్థితులపై చర్చకు పాక్‌, చైనాలను భారత్‌ ఆహ్వానించినా.. అవి హాజరు కారాదని నిర్ణయించుకున్నాయి. భారత్‌, రష్యా, ఇరాన్‌తోపాటు ఐదు మధ్యాసియా దేశాలు సమావేశంలో పాల్గొని, అఫ్గాన్‌ ప్రజల సంక్షేమానికి సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటవ్వాలని, భద్రత పటిష్ఠానికి సంయుక్త చర్యలు చేపట్టాలని పిలుపిచ్చాయి. 

  • దంచికొట్టిన రాహుల్, రోహిత్

న్యూజిలాండ్​పై రెండో టీ20 మ్యాచ్​లో ఘన విజయం సాధించింది టీమ్​ఇండియా. కివీస్​ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రాహుల్, రోహిత్ అర్ధ శతకాలతో రాణించారు.

  • 'జెర్సీ' ట్రైలర్ రిలీజ్ డేట్

మూవీ అప్​డేట్స్ వచ్చేశాయి. షాహిద్ కపూర్ 'జెర్సీ' (Jersey Trailer Release Date) ట్రైలర్​ విడుదల తేదీతో పాటు, 'బాబ్​ బిశ్వాస్'​ సినిమా రిలీజ్ డేట్​ వంటి విషయాలు ఇందులో ఉన్నాయి.

05:28 November 20

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

  • ధాన్యం కొనేలా పోరాడతాం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ధాన్యాన్ని కొనేలా పోరాడతామని... పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నదాతలకు భరోసా కల్పించారు. వడ్ల కొనుగోలు అంశాన్ని పార్లమెంటులో లెవనెత్తుతామని పేర్కొన్నారు. కల్లాలలో కాంగ్రెస్‌ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించిన రేవంత్‌... కొనుగోలు కేంద్రాల్లోని రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

  • వైన్స్​ల లైసెన్స్​ల ప్రక్రియ నేడే..

మద్యం దుకాణాల లైసెన్స్(Liquor Shop License)​ల ఎంపిక ప్రక్రియ ఇవాళ జరగనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ విధానంలో లైసెన్స్​(Liquor Shop License)లు ఎంపిక చేస్తారు. ఇందుకు ఎక్సైజ్​ శాఖ(telangana excise department) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్దం చేసింది.

  • ఎమ్మెల్సీ కరీమున్నిసా మృతి..

ఏపీలో వైకాపా ఎమ్మెల్సీ కరీమున్నిసా మృతి చెందారు. విజయవాడలో గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. విజయవాడ నుంచి ఎమ్మెల్యే కోటాలో వైకాపా నుంచి కరీమున్నిసా... ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. 

  • ఫలించిన అన్నదాతల పోరాటం..

అన్నదాతల అలుపెరగని పోరాటం ఫలించింది. అత్యంత వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల విషయంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. జాతికి క్షమాపణ చెప్పారు. సాగుచట్టాల రద్దును ఇంతకాలం తాత్సారంచేసిన మోదీ సర్కారు... త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుందని విపక్షాలు మండిపడ్డాయి.

  • రైళ్లలో ఆహారం పునరుద్ధరణ..

కరోనా కారణంగా రైళ్లలో నిలిపివేసిన ఆహారం సేవలను పునరుద్ధరించాలని రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత రైల్వే క్యాటరింగ్‌, పర్యాటక సంస్థ(ఐఆర్‌సీటీసీ)కులేఖ రాసింది. కొవిడ్-19 కారణంగా గతేడాది ఈ సేవలను నిలిపివేసింది రైల్వేశాఖ.

  • రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతి..

టిప్పర్​ లారీ- ఆటో ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన కర్ణాటక మండ్యలో జరిగింది.

  • అత్యాచార చట్టంపై పాక్​ యూటర్న్​..

రేప్​ కేసు దోషులకు లైంగిక సామర్థ్యం తొలగించేందుకు ఇటీవల తీసుకొచ్చిన బిల్లుపై పాకిస్థాన్​ వెనక్కు తగ్గింది. ఈ 'కెమికల్ కాస్ట్రేషన్​'(chemical castration pakisthan) చట్టం.. ఇస్లామిక్​ పద్ధతులకు వ్యతిరేకంగా ఉందని అంతర్జాతీయ ఇస్లామిక్​ కౌన్సిల్(సీఐఐ) స్పష్టం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

  • టర్మ్ పాలసీల ప్రీమియం పెరిగే అవకాశాలు..

కొవిడ్-19 వల్ల చాలామంది టర్మ్‌ పాలసీలను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే.. టర్మ్ పాలసీల ప్రీమియం పెరిగే అవకాశాలు ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.40 శాతం వరకు బీమా సంస్థలు పెంచనున్నట్లు సమాచారం.

  • సిరీస్​ ఇండియాదే..

న్యూజిలాండ్​పై రెండో టీ20 మ్యాచ్​లో ఘన విజయం సాధించింది టీమ్​ఇండియా. కివీస్​ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రాహుల్, రోహిత్ అర్ధ శతకాలతో రాణించారు.

  • చిరు మూవీలో నయన్​కు​ భారీ పారితోషకం..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' సినిమా​లో నయనతార(Nayanthara In Godfather) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో చిరుకు సోదరిగా ఆమె నటించనున్నారని సమాచారం. ఈ సినిమా కోసం నయన్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Last Updated : Nov 20, 2021, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details