మహాత్మా జ్యోతిరావు పూలే మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారని టీటా అధ్యక్షుడు సందీప్ మక్తాలా కొనియాడారు. ఆయన స్ఫూర్తితో టీటా ఆధ్వర్యంలో మొదటి మహిళా ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మహాత్మాజ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని కస్తూర్బాగాంధీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలతో టీటా ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు స్టార్టప్‌లు పెట్టేలా, కంపెనీ యజమానులుగా మారేలా ఈ కేంద్రం ద్వారా తోడ్పాటునందిస్తామనని పేర్కొన్నారు.