ఆమెకు ఏడుసార్లు వరుస అబార్షన్లు, ఎనిమిదోసారి గర్భం దాల్చగా 27 వారాలకే ఆడబిడ్డను ప్రసవించింది. కేవలం 710 గ్రాముల బరువుతో ఊపిరి పోసుకున్న ఓ శిశువుకు 112 రోజులపాటు ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించి సనత్‌నగర్ ఈఎస్‌ఐ వైద్యులు ఆయువు పోశారు. మేడ్చల్‌కు చెందిన రూబీదేవి 18 వారాల గర్భంతో ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చేరింది. అంతకుముందు ఆమెకు ఏడుసార్లు గర్భస్రావం జరిగింది. ఎనిమిదోసారి గర్భం దాల్చినప్పటికీ తీవ్రమైన సమస్యలు వేధించాయి.
112 రోజులపాటు చికిత్స అందించారు... పసిగుడ్డుకు ప్రాణం పోశారు...
ఓ గర్భిణీ 27 వారాలకే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కేవలం 710 గ్రాముల బరువుతో పుట్టిన పాపకు 112 రోజులపాటు ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించి సనత్‌నగర్ ఈఎస్‌ఐ వైద్యులు ఆయువు పోశారు. పాపను బతికించేందుకు రూ.20 లక్షలు ఖర్చవుతుందని పలు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు చెప్పారని, ఈఎస్‌ఐలో పైసా ఖర్చు లేకుండా చికిత్స అందించారని శిశువు తల్లిదండ్రులు తెలిపారు.
ఆమెను ఈఎస్‌ఐ ఆసుపత్రి గైనకాలజీ విభాగం హెచ్‌ఓడీ డా.అపరాజిత డిసౌజా నిరంతరం పర్యవేక్షించారు. 27వ వారంలోనే కాన్పు జరిగి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఉండాల్సిన బరువు కంటే చాలా తక్కువగా 710 గ్రాములే ఉండటం పాటు, పూర్తి ఎదుగుదల లేదు. దీంతో ఎన్‌ఐసీయూలో ఉంచి పీడియాట్రిక్స్ విభాగం వైద్యులు డా.కోదండపాణి, డా.జి.సుబ్రమణ్యం చికిత్స అందించారు. 112 రోజుల చికిత్స అనంతరం శిశువు 1.95 కిలోల బరువు పెరగడంతో తల్లికి బుధవారం అప్పగించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్, రూబీదేవి దంపతులు మాట్లాడుతూ.. పాపను బతికించేందుకు రూ.20 లక్షలు ఖర్చవుతుందని పలు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు చెప్పారని, ఈఎస్‌ఐలో పైసా ఖర్చు లేకుండా చికిత్స అందించారని తెలిపారు.
ఇవీ చదవండి:'నన్నే తిట్టావు కదమ్మా.. నాతో పాటే నువ్వూ చావు..'