హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి అలీనగర్ జలమయమై... 8మంది గల్లంతయ్యారు. పల్లెచెరువుకు భారీగా వరద నీరు చేరుతుండటంతో... దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దిగువకు వస్తున్న నీటితో అలీనగర్ నీటమునిగింది.
వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 8మంది గల్లంతు - Hyderabad floods latest news
హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలోని పల్లెచెరువుకు భారీ వరద కొనసాగుతోంది. చెరువు కట్ట ప్రమాదకరస్థితిలోకి చేరడం వల్ల దిగువకు నీటిని వదిలారు. దీనివల్ల అలీనగర్ ప్రాంతం జలమయమైంది. ఈ వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గల్లంతయ్యారు.
వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 8మంది గల్లంతు
లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరింది. ఓ కుటుంబానికి చెందిన 8 మంది గల్లంతయ్యారు. పల్లెచెరువు దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ మైకుల ద్వారా ప్రచారం చేశారు. పల్లెచెరువు వద్ద పరిస్థితిని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పర్యవేక్షించారు.