తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలి: సబితా - మంత్రి సబితా ఇంద్రారెడ్డి వార్తలు

మహేశ్వరం జిల్లా పరిషత్ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఒక్కో ఉపాధ్యాయునికి కొంతమంది విద్యార్థుల చొప్పున కేటాయించి.. ఆన్‌లైన్‌ బోధనను విద్యార్థులు ఏ మేరకు అర్ధం చేసుకుంటున్నారో పర్యవేక్షించాలన్నారు.

education minister sabitha indra reddy inspection
ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలి: సబితా

By

Published : Aug 29, 2020, 4:30 PM IST

రంగారెడ్డి మహేశ్వరం జిల్లా పరిషత్ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరును పరిశీలించిన మంత్రి.. విద్యార్థుల వద్ద టీవీలు, స్మార్ట్​ఫోన్లు అందుబాటు ఉన్నాయా? లేదా? అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ విద్యార్థుల వద్ద టీవీలు, స్మార్ట్​ఫోన్​లు లేనట్లయితే సమీపంలోని ఇతర విద్యార్థులతో కలిసి పాఠాలు వినేలా ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఒక్కో ఉపాధ్యాయునికి కొంతమంది విద్యార్థుల చొప్పున కేటాయించి.. ఆన్‌లైన్‌ బోధనను విద్యార్థులు ఏ మేరకు అర్ధం చేసుకుంటున్నారో పర్యవేక్షించాలన్నారు. కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటిస్తూ విధులకు హాజరుకావాలని ఉపాధ్యాయులకు మంత్రి సూచించారు.

ఇవీ చూడండి:భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసుల భద్రత పెంపు

ABOUT THE AUTHOR

...view details