ENFORCEMENT DIRECTORATE NEWS: తమిళనాడుకు చెందిన కరడుగట్టిన స్మగ్లర్ ఆర్.సెల్వరాజ్‌పై ఈడీ కొరడా ఝులిపించింది. ఆయనకు చెందిన ఆస్తులను జప్తు చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా కూడబెట్టుకున్న సుమారు ఏడున్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎర్రచందనం స్మగ్లర్‌పై ఈడీ కొరడా... భారీగా ఆస్తుల జప్తు
ENFORCEMENT DIRECTORATE NEWS: తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ప్రయోగించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా కూడబెట్టుకున్న సుమారు ఏడున్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది.
సెల్వరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఈడీ తెలిపింది. ఏపీ పోలీసులు, చెన్నై కస్టమ్స్ విభాగం.. గతంలో అతనిపై నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. ఎర్రచందనం అమ్మకాల ద్వారా పొందిన అక్రమ సొమ్మును చెలామణి చేసేందుకు సంజన మెటల్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేసినట్లు ఈడీ వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరిలోని వివిధ ప్రాంతాల్లో సెల్వరాజ్, అతని కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూములనూ అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది.
ఇదీ చదవండి:జీఎస్ ఆయిల్స్ లిమిటెడ్, అనుబంధ సంస్థల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ