తెలంగాణ

telangana

ETV Bharat / city

earthquake: తెల్లవారుజామున భారీ భూకంపం.. ప్రాణభయంతో ప్రజలు పరుగులు - Indonesia's eastern province earthquake

Indonesia's eastern province earthquake: ఇండోనేషియాలోని తూర్పు ప్రావిన్స్ మలుకులో బుధవారం తెల్లవారుజామున 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే అది సునామీకి అవకాశం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

earthquake hit Indonesia
earthquake hit Indonesia

By

Published : Feb 2, 2022, 3:35 PM IST

earthquake hit Indonesia: బుధవారం తెల్లవారుజామున 4:25 గంటలకు ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంప కేంద్రం మలుకు.. బరత్ దయా జిల్లాకు ఈశాన్యంగా 86 కి.మీ దూరంలో... సముద్రగర్భం కింద 131 కి.మీ లోతులో ఏర్పడింది.

దీని ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం లేకపోవడంతే అక్కడి ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. రాత్రి సమయంలో భూకంపం రావడంతో ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

ఇదీ చూడండి:ప్రపంచంలోనే అతిపెద్ద మెరుపు.. 770 కిలోమీటర్ల మేర వ్యాప్తి

ABOUT THE AUTHOR

...view details