శరన్నవరాత్రుల ముగింపుతో దసరా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నవరాత్రులు పూజలందుకున్న అమ్మవారు సెలవంటూ నదిబాట పట్టారు. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ వద్ద దుర్గా దేవీ ప్రతిమల నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నగరవాసులు ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకొని ఆడి పాడారు. 'జై దుర్గా భవాని' అంటూ నినాదాలు చేస్తూ మళ్లీ రా దుర్గమ్మ అంటూ అమ్మను గంగమ్మ ఒడిలోకి సాగనంపారు.
అట్టహాసంగా ముగిసిన దసరా వేడుకలు - అట్టహాసంగా ముగిసిన దసరా వేడుకలు
నగరంలో శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా ముగిసాయి. తొమ్మిది రాత్రులు పూజలందుకున్న అమ్మవారిని నగరవాసులు 'మళ్లీ రా దుర్గమ్మ' అంటూ గంగమ్మ ఒడిలోకి సాగనంపారు.
అట్టహాసంగా ముగిసిన దసరా వేడుకలు