సాంకేతికత, ఆటోలు, ద్విచక్ర వాహనాలు లేని రోజుల్లో సరైన రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడేవారు. ఆ కాలంలో గుర్రం బండ్లే రవాణా సాధనాలు. అందుకే వాటికి మంచి డిమాండ్ ఉండేది.
కర్ఫ్యూ ఎఫెక్ట్ : గుర్రపు బండే గూడ్స్ క్యారియర్
ఇప్పుడంతా స్పీడు యుగం.. మనిషి రోజు వారీగానే ఆకాశమార్గంలో ప్రయాణిస్తున్న రోజులివి. పూర్వం అలా కాదు. ధనవంతులకు, శ్రీమంతులకు మాత్రమే జట్కా బండ్లు ఉండేవి. ఎక్కువ మంది సైతం ఇదే పద్ధతిలో ప్రయాణం చేసేవారు. ఇప్పుడు లాక్డౌన్ సమయంలో తన గుర్రపుబండి ఎక్కేవారు లేరని ఉపాధి కోసం గూడ్స్ క్యారియర్‌గా మార్చాడు తూర్పుగోదావరి జిల్లా వాసి.
During Curfew period, the horse Cart was transformed to a carrier of goods in Ayinapalli
కాలక్రమంలో ఆ బండ్లు కనుమరుగైపోయాయి. అయినా దాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లికి చెందిన చిన సత్యం. పూర్వ నుంచి ఈయనకు గుర్రపు బండే జీవనాధారం. ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు లేక బండి బోసిబోయింది. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా తన గుర్రపు బండిని సరుకు రవాణా చేసే బండిగా మార్పులు చేసి జీవిస్తున్నాడు.