తెలంగాణ

telangana

ETV Bharat / city

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ - corona virus update news

కరోనాపై పోరుకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మెుత్తం 2 కోట్ల 15 లక్షల రూపాయలను 15 మంది దాతలు మంత్రి కేటీఆర్​ ద్వారా సీఎం సహాయనిధికి అందజేశారు.

donations_to_cm relief fund
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

By

Published : May 1, 2020, 9:45 PM IST

కొవిడ్​పై పోరుకు ముఖ్యమంత్రి సహాయనిధికి దాతలు ఇవాళ విరాళాలు అందించారు. మొత్తం రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలను 15 మంది దాతలు మంత్రి కేటీఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. నార్నే ఎస్టేట్స్ సీఈవో గోకుల్ యాభై లక్షల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్​కు అందజేశారు. స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ 25 లక్షలు, రానే గ్రూపు 30 లక్షలు, నెక్టర్ థెరపెటిక్స్ ఇండియా 15 లక్షలు, తెలంగాణ రికగ్నైజ్​డ్​ స్కూల్ మేనేజ్​మెంట్​ అసోసియేషన్ తరఫున కందాల పాపిరెడ్డి 11 లక్షలు, తెలంగాణ స్టేట్ బీడీ లీవ్స్ ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఎనిమిది లక్షలు, ఫతే మైదాన్ క్లబ్ ఆరు లక్షల రూపాయలను సీఎం సహాయనిధికి అందించారు.

సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సైనర్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్వామి వివేకానంద సేవా సమితి 5 లక్షల చొప్పున విరాళాలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్​జోన్ జిల్లాలివే...

ABOUT THE AUTHOR

...view details