ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాలలోని మధుమణి నర్సింగ్ హోమ్ ఆస్పత్రిలో రూ.13 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ను ఉచితంగా చేశారు. వినికిడి లోపం ఉన్న సాత్విక్ అనే రెండు సంవత్సరాల బాలుడికి ఏక కాలంలో రెండు చెవులకు శస్త్ర చికిత్స చేసినట్లు వైద్యుడు సి.మధుసూధన్ రావు తెలిపారు. ఒకే సమయంలో రెండు చెవులకు ఆపరేషన్ నిర్వహించటం రాయలసీమలో ఇదే తొలిసారని చెప్పారు. శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ ఆపరేషన్ చేసినట్లు చెప్పారు.
ఏకకాలంలో రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్.. - cochlear implant surgery latest news
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ను రెండు చెవులకు ఒకేసారి చేశారు. తొలిసారిగా ఇటువంటి చికిత్స చేసి విజయవంతమైనట్లు మధుమణి నర్సింగ్ హోమ్ వైద్యులు తెలిపారు.

రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్
ఆపరేషన్ విజయవంతమైన సందర్భంగా వైద్యులు కార్యక్రమం ఏర్పాటు చేశారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి వైద్యుల సేవలను అభినందించారు. ఏకకాలంలో రెండు చెవులకు చికిత్స పూరైందని బాలుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శస్త్ర చికిత్స చేయించుకున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు, వైద్యులు, ఐఎంఏ జాతీయ సభ్యులు డా.రవి కృష్ణ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:క్యాన్సర్తో బాధపడుతున్న బాలుడి చికిత్సకు సర్పంచ్ సాయం