తెలంగాణ

telangana

ETV Bharat / city

Minister Jagadish Reddy : 'త్వరలోనే.. పురపాలక వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి'

రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వసతి గృహాల్లో రూఫ్​టాప్​లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి(Telangana Minister Jagadish Reddy) తెలిపారు. త్వరలోనే పురపాలక వ్యర్థాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేసే దిశలో అడుగులు వేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Minister Jagadish Reddy
Minister Jagadish Reddy

By

Published : Oct 8, 2021, 11:40 AM IST

రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి(Solar Power Generation)ని పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి(Telangana Minister Jagadish Reddy) తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రూప్​టాప్​లు ఏర్పాటు చేసి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లోనూ రూఫ్​టాప్​లపై సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాటు చేసి గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో సోలార్(Solar Power Generation), పవన విద్యుత్ ఉత్పత్తిలో నిర్ణయించిన లక్ష్యాలేంటి? సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడానికి తీసుకుంటున్న చర్యలు ఏంటి? పురపాలికలో లభ్యమయ్యే వ్యర్థ పదార్థాల నుంచి ఇంధనం ఉత్పత్తి చేసేందుకు ప్రతిపాదన ఏదైనా ఉందా? రూఫ్​టాప్​లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందా? అని పలువురు ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి(Telangana Minister Jagadish Reddy) సమాధానం ఇచ్చారు.

తెలంగాణలో 2023 నాటికి ఎన్టీపీసీ ద్వారా 2,092 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు మంత్రి జగదీశ్(Telangana Minister Jagadish Reddy) తెలిపారు. రూఫ్​టాఫ్​ ద్వారా 260 మెగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు రచించినట్లు వెల్లడించారు. రూఫ్​టాప్​లో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్ర సర్కార్ సబ్సిడీ అందజేస్తోందని స్పష్టం చేశారు. గృహవినియోగదారులకు సంబంధించి.. రూఫ్​టాప్​లో.. 3 కిలోవాట్ల వరకు 40 శాతం, 3 నుంచి 10 కిలోవాట్ల వరకు 20 శాతం సబ్సిడీ ఇస్తోందని చెప్పారు. 10కిలోవాట్లు దాటిన తర్వాత సబ్సిడీ లేదని వివరించారు.

"రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పత్తి(Wind Power Generation)కి అంతగా ఆస్కారం లేదు. చాలా తక్కువ ప్రాంతాలు మాత్రమే పవన విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. కానీ విండ్ ఎనర్జీతో చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. గాలి ఎక్కువగా వీచినా.. తక్కువగా వీచినా సమస్యే. పవన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న చాలా రాష్ట్రాలు వాటిని నిలిపివేసే దిశగా యోచన చేస్తున్నాయి. తెలంగాణలో అంత ఆస్కారం లేదు కాబట్టి ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నాం."

- జగదీశ్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి

ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనది పురపాలక వ్యర్థాల నిర్వహణ అని జగదీశ్ రెడ్డి(Telangana Minister Jagadish Reddy) అన్నారు. మున్సిపల్ వ్యర్థాల డిస్పోజల్ వేల ఎకరాలను ఆక్రమిస్తోందని.. వీటి నిర్వహణను సక్రమంగా వినియోగించి ఇంధనం ఉత్పత్తి చేస్తే.. చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో పురపాలక వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రతిపాదనలు ఉన్నాయని.. ఎవరైనా ముందుకొస్తే తప్పక పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details